బింబిసారా, ఆమిగోస్, ఓం త్రిడి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు కల్యాణ్ రామ్. నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్ తర్వాత అత్యంత సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈయన భార్య గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
కల్యాణ్ ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి ముఖ్య కారణం ఆయన భార్య స్వాతి అట. ఆమె డైరెక్టర్. అయినా వృత్తిపరంగా వెళ్లకుండా భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తుంది. ఈ హీరో నటించే ప్రతి మూవీ స్వాతి.. ఈమె బ్రదర్ కలిసే ప్రొడక్షన్ పనులన్నీ చూసుకుంటారట. ఇక సినిమా ఒక్కసారి కనుక హిట్ కొడితే మరో 10 సినిమాలు తీయవచ్చు. ఫ్లాప్ అయినా పెద్దగా ఇబ్బందేమీ లేదు.
ఎందుకంటే సొంత బ్యానర్ లోనే మూవీస్ చేస్తున్నారు కాబట్టి. ఇక వీరి పిల్లలు పెద్దయ్యాక సొంతంగా విఎఫ్ సంస్థను ప్రారంభించే ఆలోచనలో కూడా ఉన్నారట. స్వాతి.. కల్యాణ్ రామ్ వ్యవహారాలే కాకుండా ఇతర బిజినెస్ పనులు కూడా చూసుకుంటుందట. కాగా నందమూరి కుటుంబానికి ఎంతో విలువనిస్తూ.. సోషల్ మీడియాకు దూరంగా ఉండే కల్యాణ్ రామ్ భార్య స్వాతి పై ప్రేక్షకులు పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు.