రామ్ పోతినేని ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం స్కంద మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోని స్కంద ప్రమోషన్స్ కు వెళ్ళాడు. ఇక్కడ రామ్ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చి తన ఫాన్సను అలరించాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ ” స్కంద “. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ క్రమంలోని రామ్, శ్రీ లీల ప్రమోషన్స్ కు సంబంధించిన మేకర్స్ లాంచ్ చేసిన పోస్టర్లను రిలీజ్ చేయగా.. మ్యాచింగ్ బ్లూ కలర్ డ్రెస్ లలో ఇంటర్వ్యూకు హాజరయ్యి అలరించారు.
అయితే ఈసారి రామ్ స్టైలిష్ లుక్ లో కాకుండా షాట్లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ విజువల్స్.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ ట్రెండ్ ఫాలో అవ్వడు సెట్ చేస్తాడు అంటు.. న్యూ ట్రెండ్ అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.