చర్మం, జుట్టు సమస్యలకు ఈ గింజలతో చెక్ పెట్టండి..

అవిసె గింజలు చర్మానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజలను తీసుకోవడం వల్ల గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడతలు, చక్కటి గీతలను తగ్గించటానికి సహాయపడతాయి. అదనంగా వీటిలో ఉండే కొవ్వు ఆమ్లాలు, చర్మం పొడిబారకుండా, మృదువుగా తేమను ఉంచడానికి సహాయపడతాయి. అదేవిధంగా అవిసెగింజలు శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను సమతుల్యం చేయగలవు.

ఇవి మొటిమల వ్యాప్తిని నివారించడంతోపాటు, దద్దుర్లు అసౌకర్యతను ఉపశమనాన్ని ఇస్తాయి. ముఖంపై అధిక తేమ కూడా మొటిమలకు కారణం అవిస గింజలు దిని నియంత్రిస్తాయి. ఇక వాటిని తినడంతో పాటు ఫేస్ ప్యాక్ లోకి కూడా జోడించడం వల్ల చర్మానికి మంచి జరుగుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి ముఖాన్ని సమర్థవంతంగా చేస్తుంది. దీన్ని మెత్తటి పౌడర్ లా చేసి ఏదైనా లిక్విడ్ బేస్ తో ఉపయోగించాలి. అవిసె గింజలు రంద్రాలను చిన్న‌గా మార్చడంలో కూడా సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యం విటమిన్ ఈ తో ఆధారపడి ఉంటుంది. జుట్టు డామేజ్ ని తగ్గించడానికి మార్కెట్లోని జుట్టు ఉత్పత్తులకు విటమిన్ ఇని వాడుతూనే ఉంటారు.

చర్మం, జుట్టు సమస్యల కోసం వాతావరణంలో ప్రి రాడికల్ నష్టాన్ని నివరించి జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతం చేస్తాయి. అదేవిధంగా జుట్టు రాలడం నష్టాన్ని తగ్గించి.. పొడి చర్మం వల్ల చుండ్రు జుట్టు పొడవారకుండా అవిస గింజ లు తలలో మూలాలకు రాసుకుంటూ ఉండాలి. శరీరంలో అదనపు కొవ్వు కణజాలం ఉండడం వల్ల అనేక సమస్యలు ఊబకాయం లాంటివి సంభవిస్తాయి. అవిసె గింజలు తింటే ఎక్కువ ఆహారం తినకుండానే మీ పొట్ట నిండుగా ఉంటుంది. ఆరోగ్యకరమైన దంతాలు కూడా అవిసె గింజలతో సాధ్యం. క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలమంతా అవిసె గింజల్లో ఉంటుంది. ఇవి దంతాలకు చాలా అవసరం.