పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత.. బిఆర్‌ఎస్‌లో కీలక పదవి..!!

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ఏం మాయ చేసావే” సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈ మధ్య కాలంలో మయోసైటిస్ బారిన పడి కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది. ఇక ఆ తరువాత మళ్లీ కోల్కొని ఖుషి సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె అమెరికాకి వెళ్ళింది. మయోసైటిస్ చికిత్స కోసం సమంతా కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండనుంది.

ఇటీవల ఎక్కువగా సినీ ఇండస్ట్రీ వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం చూస్తూనే ఉన్నాం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాలిటిక్స్‌లోకి వస్తుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ ప్రజలకు సమంతా అంటే ఎక్కువ అభిమానం ఉంటుంది. రైతన్నలకు మద్ధతుగా ఇప్పటికీ చాలా కార్యక్రమాల్లో పాల్గొంది. అలాగే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి ఆమెను బిఆర్ఎస్ ఆహ్వానించి.. స్టార్ క్యాంపెయిన్ గా ప్రచారం చేయిస్తే పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారట.

ఇందులో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ బీఆర్ఎస్ అధిష్టానం సామ్‌తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ విషయంపై సమంత ఫ్యాన్స్.. తనకు రాజకీయాల్లోకి రావడం అసలు ఇష్టం లేదు. ఇప్పటికే అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతుంది. ఇలాంటి పుకార్లు తీసుకురావద్దని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే స్వయంగా సమంతానే స్పందించాలని మరి కొంతమంది అంటున్నారు.