విదేశాల‌కు చెక్కేసిన నాగ‌బాబు ఫ్యామిలీ… కార‌ణం అదేనా..!

మెగా డాటర్ నిహారిక ఇటీవ‌ల‌ భర్తకు విడాకులు ఇచ్చి ఫ్రెండ్స్ తో కుటుంబంతో కలిసి వెకేషన్‌లు ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక తన ఫ్యామిలీ మొత్తం తో కలిసి ఆఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా వైల్డ్‌ సఫారీ పెట్టింది పేరు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అక్కడికి వెళ్లిన టూరిస్ట్‌లు జీవన వైవిద్యం వైల్డ్‌ సఫారీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్ర‌స్తుతం నాగబాబు ఫ్యామిలీ సైతం వైల్డ్ సఫారీ చేస్తున్నారు. నిహారిక ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేసింది. అలాగే వరుణ్ తేజ్ కూడా నకుర్‌ లేక్‌ దగ్గర ఉన్నట్లు తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకున్నాడు. నాగబాబు తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేస్తూ నా దేవదూత, యువరాణి, నా సింహంతో కలిసి గర్వంగా మసాయి మరా యొక్క సవన్న‌లోకి ప్రయాణాన్ని మొదలుపెట్టాను అంటూ రాసుకొచ్చాడు.

మరి ఇదే ఈ విదేశీ టూర్‌లో వరుణ్ తేజ్ వివాహ వేదిక సంబంధించిన లొకేషన్ సెట్ట్ చేయ‌డానికి ఫ్యామిలీ ట్రిప్ స్టార్ట్ చేసి ఉంటారు. ఏదేమైనా చాలా కాలం తర్వాత నాగబాబు ఫ్యామిలీ మొత్తం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.. దీంతో ఈ పోస్ట్ ని చూసిన మెగా ఫాన్స్ వరుణ్ పెళ్లికే ప్లేస్ సెలెక్ట్ చేయడానికి వెళ్లారు అంటూ ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ నటించిన రెండు సినిమాలు అతనికి భారీ డిజాస్టర్ గా నిలిచాయి.