ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన నయనతార.. ఈమె ఫాలో అవుతున్న ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరంటే..!?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురువారం అనగా ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది.. నెగిటివిటీ, విమర్శలకు దూరంగా ఉండాలనే ఆలోచనతో కెరీర్ మొదటి నుంచి సోషల్ మీడియా, సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటూ వస్తుంది నయనతార. సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఏకైక స్టార్ హీరోయిన్‌గా నయనతార నిలిచింది.

ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తనకి తాను పెట్టుకున్న నిబంధనకు ఇన్నాళ్లు కట్టుబడి ఉన్న తన నిర్ణయాన్ని నయనతార మార్చుకుంది. ఈరోజు ఇంస్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చి తన అభిమానులను సర్ప్రైజ్ చేసింది. తన కవల పిల్లలతో కలిసి దిగిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ వీడియోలో న‌య‌న‌తార‌తో పాటు ఆమె పిల్లలు సన్ గ్లాసెస్ పెట్టుకొని ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన గంటలోపే ఆమె ఖాతాను నలభై వేల మందికి పైగా ఫాలోవర్స్ అనుసరించడం మొదలుపెట్టారు. ఇక నయనతార ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం కేవలం ఐదుగురును మాత్రమే ఫాలో అవుతుంది. ఇందులో తన భర్త విఘ్నేష్ శివన్‌తో పటు ఓన్ ప్రొడక్షన్ హౌజ్ రౌడీ పిక్చర్స్ ఖాతాలను నయనతార ఫాలో అవుతుంది. అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో పాటు మిచెల్ ఒబామా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను నయనతార ఫాలో అవుతుంది.

సోషల్ మీడియా అకౌంట్లో న‌య‌న‌తార‌ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో షారుక్ ఖాన్ కావటం ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం. టాలీవుడ్‌, కోలీవుడ్‌ హీరోలను ఎవరిని కాకుండా బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఫాలో కావడం ఆసక్తికరంగా మారింది. షారుఖ్‌ఖాన్ జవాన్ సినిమాతో నయనతార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతోంది. అట్లీ దర్వకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తోన్నాడు. దీపికా పడుకోణ్ గెస్ట్ రోల్ చేస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)