బొద్దుగా తయారైన అరియనా గ్లోరీ.. టైట్‌ డ్రెస్‌లో టెంప్టింగ్ పోజులు..

తెలుగు యాంకర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్‌ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. ఈ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ టైట్ జీన్స్, పింక్ టాప్‌లో కనిపించింది. షేర్ చేసిన కొంత సమయానికే ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, నెటిజన్లు ఈ పిక్స్ చూసి సూపర్ హాట్ గా ఉన్నావంటూ కొంటె కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది బొద్దుగా తయారయ్యిందని కామెంట్లు పెడుతున్నారు.

అరియానా ప్రస్తుతం ఆస్ట్రేలియా వీధుల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే అక్కడ ఆమె సిడ్నీలోని ఎత్తైన భవనంలో ఫోటోషూట్ చేసింది. పింక్ కలర్ టాప్ లో నడుము అందాలు, టైట్ డ్రెస్ లో హాట్ ఫిగర్ చూపించింది. అరియానాకు వివాదాలు కొత్తేమీ కాదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ తర్వాత ఆమె బాగా పాపులర్ అయింది. అందులో అతను ఆమె థైస్ గురించి బోల్డ్ కామెంట్స్‌ చేశాడు. అరియనా చాలా బోల్డ్ గా ఉంటుంది. తన జీవితానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను పంచుకోవడానికి ఏమాత్రం వెనకాడదు.

విమర్శలు ఉన్నప్పటికీ, అరియానా చాలా పాపులర్ అయ్యింది. ఆమె ముక్కు సూటితనానికి, డౌన్-టు ఎర్త్ వ్యక్తిత్వానికి చాలా మంది ఫిదా అయ్యారు. అరియానా నటి కూడా. అరియానా లేటెస్ట్ ఫోటోషూట్ తో తాను హద్దులు దాటడానికి భయపడనని స్పష్టం చేసింది. ఆత్మవిశ్వాసంతో ఉండే ఈ బ్యూటీ తనకు నచ్చినట్లు బతకడానికి భయపడదు. ఎందరో యువతులకు స్ఫూర్తిదాయకమైన ఆమె రాబోయే సంవత్సరాల్లో మంచి రోల్స్ దక్కించుకొని విజయవంతమైన తారగా కొనసాగడం ఖాయం.

ఇకపోతే అరియానా బిగ్ బాస్ ప్రయాణం రోలర్ కోస్టర్ లా సాగింది. ఆమె మొదట్లో టైటిల్ గెలిచేటట్లు కనిపించింది, కానీ చివరికి నాల్గవ స్థానంలో నిలిచింది. బిగ్ బాస్ తనకు అందించిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అరియానా తెలిపింది. ఒక వ్యక్తిగా ఎదగడానికి, మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఈ షో తనకు సహాయపడిందని ఆమె అభిప్రాయపడింది.

అరియానా ప్రస్తుతం కొత్త వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోతో సహా అనేక ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. ఎంతో మంది యువతులకు అరియానా రోల్ మోడల్ అని బిగ్ బాస్ షో సమయంలో కామెంట్లు వినిపించాయి.