ఇండియాలో ఫ్యూన్ శాల‌రీ… నేపాల్లో స్టార్ క్రికెట‌ర్ల జీతం ఒక్క‌టేనా…!

నేపాల్ క్రికెట్ టీం మొదటిసారిగా ఏషియన్ కప్ లో ఆడబోతుంది. నేషనల్ క్రికెట‌ర్ల జీతం ఎంతో తెలుసా..? క్రికెట్‌లో డబ్బు బాగా సంపాదిస్తారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి టీమ్‌లో ఆటగాళ్లపై డబ్బులు వర్షం ఒకేలా ఉండదు. భారత్‌ క్రికెటర్ల  షేర్లు.. వారి సంపాదన గురించి నేపాల్ క్రికెట్ ఆటగాళ్లు అస్సలు ఆలోచించరు. నిజం చెప్పాలంటే నేపాల్ క్రికెటర్లు జీతం చాలా తక్కువట. భారతదేశంలో ఇతర దేశాల మాదిరిగానే నేపాల్ క్రికెట్ బోర్డు కూడా తన ఆటగాళ్లను వార్షిక ఒప్పందానికే తీసుకుంటుంది. కానీ వారిని మూడు కేటగిరీలుగా విభజించి దానికి అనుగుణంగా జీతం ఇస్తుంది.

దాని విలువ భారతి రూపాయల్లో ఎంత అనుకుంటున్నారు.. ఒకసారి నేపాల్ క్రికెటర్లకు ఎంత జీతం వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం నేపాల్ మెన్స్ క్రికెట్ జట్టును మూడో విభాగాలుగా డివైడ్ చేస్తారు. ఏ గ్రేడ్ లో చేరిన క్రికెటర్లు ప్రతినెల రూ.60 వేల జీతం అందుకుంటారు. బి గ్రేడ్ లో ఉన్న వారికి రూ.50 వేల జీతం సి గ్రేడ్‌లో ఉన్న వారికి రూ.40 వేల జీతం అందుతుంది. ఇక నేపాల్ లో రూ.60 వేల జీతం భారతీయ‌ రూపాయల్లో కేవలం రూ.37,719 మాత్రమే నేపాల్ ప్లేయర్స్ కు వస్తున్నట్లు. అలాగే రూ.50 వేల రూపాయలు అంటే భారత్ లో రూ.31,412 మాత్రమే రూ.40 అంటే కేవలం భార‌త్‌లో రూ25 వేలు మాత్రమే క్రికెటర్లు అందుకుంటున్నట్లు.

ఇలా భారతదేశ ప్రభుత్వ సంస్థలో పనిచేసే ప్యూన్ జీతం నేపాల్ క్రికెటర్లు నెలకు వచ్చే జీతం కంటే ఎక్కువ. ఇక్కడ కనీసం వారి టోటల్ ప్యాకేజీ కూడా సంవత్సరానికి రూ.5.5 లక్షలు చేరదు. ఒక వన్డే కప్ కి రూ6వేలు. సెంట్రల్ కాంటాక్ట్ ప్రకారం నెలవారి జీతం నేపాల్ క్రికెటర్లకు ఇతర ఆదాయ వ‌న‌రు వారు ప్రతి మ్యాచ్‌కి పొందే రుసుము అలా ఒక్క వన్డే ఆడించిన నేపాలిలో రూ10 వేలు, టి20 మ్యాచ్ ఆడినందుకు రూ.5000 అందుకుంటారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం వారు ఓడిఐకి రూ.6,286 , t20 కి రూ.3,143 మాత్రమే అందుకుంటున్నారు. డబ్బు తక్కువే కానీ నేపాలి క్రికెటర్ల ఆట బలంగా ఉంటుంది. ప్రస్తుతం వీరి శాలరీ ఇంత తక్కువ అనే అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.