ఎన్టీఆర్ బామ్మ‌ర్ది నితిన్ కొత్త సినిమా టీజ‌ర్ చూశారా… బొమ్మ హిట్టే ( వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్ హీరోగా త‌న కెరీర్‌ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మొదటి సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది. ఇక రెండో సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టుకున్నాడు నితిన్. ఈసారి యూత్ ఫుల్ మూవీని ఎంచుకున్నాడు నితిన్. కాలేజ్ డేస్ నేపథ్యంలో సాగే అల్లర్లు, ఎంజాయ్మెంట్‌లు కాలేజ్ లైఫ్ ఎలా సాగింది అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో నితిన్ తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోస్ హీరోలుగా నటిస్తున్నారు. సంగీత్ శోభన్, రామ్‌లు ఇందులో హీరోలుగా నటించనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే తాజాగా ఒక్క నిమిషం నరసాగే టీజర్ ను రిలీజ్ చేశారు మూవీ టీం. ఈ టీజ‌ర్ చూసినంత సేపు ఫుల్ ఫన్నీగా సాగుతుంది. మూవీ టైటిల్‌కు తగ్గట్లే వీరు కూడా అల్లరి అల్లరిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కాలేజ్ నేపథ్యంలో తుర‌కెక్కిన‌ సినిమాలన్నింటినీ ప్రేక్షకులు బాగా ఆదరించారు. దీంతో ఈ సినిమా కూడా కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కడం.. వీరి అల్లరి సినిమాకు ప్లస్ అవుతుందని ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని మూవీ టీం నమ్ముతున్నారు.

ఈ సినిమాలో జాతి రత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో గౌరీ ప్రియా రెడ్డి, అవంతిక, గోపిక అనే ముగ్గురు అమ్మాయిలను హీరోయిన్గా నిర్ణయించారు. వీరు ముగ్గురు ఈ సినిమాతోనే టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాకి బీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. దత్త సైమద్దీన్, సినిమాటోగ్రఫీ నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ దినేష్ కృష్ణ బి.. ఈ సినిమాకు ఎడిటింగ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా తో ఈ ముగ్గురు యంగ్ హీరోల కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.