ఈ క్యూట్ బాయ్ సౌత్ స్టార్ హీరో.. ఎవరు గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో చాలామంది స్టార్ నటీనటుల చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను పాపులర్ చేయడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బాయ్ ప్రస్తుతం సౌత్ స్టార్ హీరో. కోట్లాదిమంది అభిమానులు ఉన్న ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాల పైన అవుతుంది మంచి క్రేజ్‌తో యంగ్ హీరోలకు దీటుగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.

ఇటీవల పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బాస్ట‌ర్‌ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..? ఎస్ మీరు గెస్ చేసింది కరెక్ట్. అత‌డు ఎవరో కాదు కొలీవుడ్ తలైవన్.. టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తెరపై కనిపిస్తే చాలు థియేటర్లో రచ్చ ఒరేంజ్ లో ఉంటుంది. తమిళ, తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజిని కొంతకాలం గ్యాప్‌ తర్వాత జైల‌ర్‌ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని కలెక్షన్ల ఊచకోతతో దూసుకుపోతున్నాడు.

రిలీజ్ అయిన ఆ6 రోజుల్లోనే రూ.400 కోట్లకు పైన వసూలు చేసిన ఈ మూవీ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రజినీకాంత్ పర్సనల్ విషయానికి వస్తే ఆయన అసలు పేరు శివాజీ గైక్వాడ్. తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు. రజనీకాంత్ 9 నెల వయసులోనే తల్లిని కోల్పోయాడు. తర్వాత ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూ రామకృష్ణ మఠం లో చేరి ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకున్నాడు.

ఒకసారి మఠంలో నాటకం ప్రదర్శించగా అందులో ఏకలవ్యుడి పాత్రలో రజనీకాంత్ నటించి చాలామంది ప్రముఖులతో ప్రశంసలు అందడంతో నటిన పై ఆసక్తి పెరిగింది. తమిళనాడులో కండక్టర్ గా ఉంటున్న టైంలోనే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత రజినీకాంత్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.