కొంటె చూపులతో కైపెక్కిస్తున్న అనుపమ పరమేశ్వరన్…

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘అ ఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఆ తరువాత తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించి మెప్పించింది. మలయాళ చిత్రాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనే మంచి సక్సెస్ ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనుపమ. తన చిలిపి చేష్టలతో సోషల్ మీడియా ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది.

ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ కేరళ కుట్టి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంగా కొన్ని క్యూట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది అనుపమ పరమేశ్వరన్. ఈ ముద్దుగుమ్మ టైట్ క్యాజువల్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఆ డ్రెస్ లో రకరకాల ఫోజులతో ఫోటోలు దిగి కుర్ర హృదయాలను కట్టిపడేసింది. ఇంకోవైపు ముద్దులతో ముంచేస్తూ అందరి మతులు చెడగొడుతుంది. టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ స్ట్రక్చర్ ను ప్రదర్శిస్తూ అట్రాక్ట్ చేసింది.

తన అంద చందాలతో అందరినీ అలరిస్తుంది. ఈ అమ్మడు తన చిలిపితనానికి రొమాన్స్ ని జోడించి ఫొటోస్ దిగి కుర్రాలను కట్టిపడేస్తుంది. అనుపమ షేర్ చేసిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్,  సిద్దు జొన్నలగడ్డ  సరసన ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుండి రేపు సాయంత్రం సాంగ్ విడుదల కాబోతున్న కారణంగా అనుపమ క్రేజీ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ‘టిల్లు స్క్వేర్ ‘తో పాటుగా, రవితేజ తో  ‘ఈగల్ ‘ , తమిళంలో ‘సైరన్ ‘, మలయాళం లో ‘ జే ఎస్కే ‘ అనే సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.