నయనతార పరిచయం అవసరం లేని పేరు. తనదైన టాలెంట్‌తో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార.. గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను మెయింటైన్ చేస్తూనే.. మరోవైపు కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అయితే నయనతార గొప్ప నటి మాత్రమే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. ఈ విషయం ఎన్నో సార్లు రుజువు అయింది. వీలు కుదిరినప్పుడల్లా భర్త విఘ్నేష్ శివన్ తో కలసి చెన్నై నగరంలోని పేదలకు సాయం చేస్తుంటుంది.
అవసరమైన వస్తువులు, ఫుడ్, దుస్తులు లాంటివి అందించింది. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది. ఓ వైపు జోరుగా వర్షం కురుస్తున్నా సరే పట్టించుకోకుండా భర్తతో కలసి ఆమె వీధుల్లోని వారికి వస్తు సామగ్రిని పంచింది. బస్ షెల్టర్ వద్ద సేదతీరుతున్న వారికి సామాగ్రి అందిస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్ లోకి చేరింది. అందులో విఘ్నేష్ శివన్ ఒక చేత్తో గొడుగు పట్టుకోగా, మరో చేత్తో కవర్ లను పట్టుకున్నాడు. నయనతార ఒక్కోటీ తీసుకుని అక్కడున్న పేదలకు అందజేసింది. దీంతో శభాస్ అంటూ నయనతార దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి మనసున్న బ్యూటిఫుల్ కపుల్ అంటూ కొనియాడుతున్నారు.
It was really kind of Lady Superstar #Nayanthara and @VigneshShivN to assist homeless persons on the streets who were suffering from the rain. #inspiringcouple pic.twitter.com/4sMsE8gbUS
— Chennai Memes (@MemesChennai) April 8, 2023