తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన విజయ్‌కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా అతి పెద్ద రెమ్యునరేషన్ తీసుకునే కొద్ది మంది హీరోలో విజయ్ కూడా ఒకరు. అయితే ఇలాంటి స్టార్ సెలబ్రిటీకి ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోవడం గమనార్హం. కాగా ఇటీవలే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని క్రియేట్ చేసారు విజయ్. Actorvijay అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని ఓపెన్ చేసారు. అలానే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఒక ఫొటోని షేర్ చేసారు.
లొకేష్ కంగరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియో సినిమాలో విజయ్ హీరోగా నటిస్తున్నారు. అలానే ఈ సినిమాలో త్రిష, గౌతమ్ మినన్, సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. లియో సినిమా షూటింగ్ సందర్భంగా కశ్మీర్ వెళ్లారు మూవీ టీమ్. కశ్మీర్ మంచులో దిగిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు విజయ్.
అయితే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని విజయ్ స్టాఫ్ మెయింటైన్ చేస్తారట. అకౌంట్ క్రియేట్ చేసిన సందర్బంగా విజయ్ మొదటిగా ఫొటోని షేర్ చేసి ‘నా స్నేహితులందరికీ హలో’ అని తమిళ్ లో పోస్ట్ చేసారు. ఇక విజయ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన గంటకే 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారట. ఇలా మూడు గంటలలో 2 మిలియన్స్ ఫాలోవర్స్ వస్తే, హాఫ్ డేలోనే 3.5 మిలియన్ ఫాలోవర్స్ విజయ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయ్యారు. ఈ సంఖ్య అలా పెరుగుతూ పోతుంది.