ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ నామినేషన్ల తుది జాబితా ఈరోజు రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ల పై ఇండియాలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం త్రిబుల్ ఆర్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అరుదైన రికార్డులను దక్కించుకుంటూ ఆస్కార్ అవార్డు వైపు దూసుకుపోతుంది. దీనితోపాటు త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ పేరు కూడా ఆస్కార్ కు నామినేట్ అయింది.
ఇప్పుడు తుది జాబితాలో ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉంటుందని అందరూ బలంగా ఉన్న నేపథ్యంలో పలు విదేశీ మీడియా సంస్థలు సైతం ఈ విషయాన్ని బలపరచడంతో రాబోయే కొన్ని గంటలు యంగ్ టైగర్ అభిమానులకి సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోయాయి. ఇప్పటికి ఇప్పుడు ఈ అవార్డు రాకపోయినా ఈ జాబితాలో చోటు దక్కటం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ నామినేషన్ లో ఎందరో అగ్ర నటులు ఉన్న త్రిబుల్ ఆర్ సినిమాకు దక్కే స్థానాల మీద హాలీవుడ్ సెలబ్రెటీలు సైతం ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’ హాలీవుడ్ ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును కూడా దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా జపాన్ ప్రతిష్టాత్మక అవార్డును కూడా త్రిబుల్ ఆర్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇన్నీ ప్రతిష్టాత్మక అవార్డులో దక్కించుకున్న ‘నాటు నాటు సాంగ్’ మాత్రం కన్ఫామ్ గా ఆస్కార్ నామినేషన్ లో ఉంటుందని హాలీవుడ్ క్రిటిక్స్ సైతం అంచున వేస్తున్నారు. ఈ అంచనాలు అన్ని ప్రస్తుతానికి నిజమయ్యే అవకాశాలకు సాధ్యం కానీ అంచనాలకు మధ్యలో నలిగిపోతున్నాయి.
సోషల్ మీడియాలో మాత్రం గత రెండు మూడు రోజులుగా ఈ విషయాలపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ క్యామరూన్- రాజమౌళితో మాట కలిపిన విషయాన్ని పక్కన పెట్టి ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తీవ్రమైన నెగటివ్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మరోపక్క చరణ్-ఎన్టీఆర్ స్నేహం మరింత బలపడుతుంటే అభిమానుల తీరు మరోరకంగా ఉంది.
ఎవరు ఎన్ని అనుకున్నా ఆస్కార్ నామినేషన్ల విభాగంలో చోటు దక్కిన దక్కకపోయినా త్రిబుల్ ఆర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో భారతీయ సినిమా స్థాయి ఏంటో చూపించింది. ఆస్కార్ అవార్డు వస్తే త్రిబుల్ ఆర్ కి వచ్చిన రికార్డులో అదో విశిష్టమైన ఘనత అవుతుంది. ఒకవేళ అది రాకపోయినా ఈ సినిమా యూనిట్‌కు జీవితాంతం ఎంతో గొప్పగా చెప్పుకునే ఎన్నో గొప్ప ఘనతలు వారు అందుకున్నారు.
ఇప్పుడు ఈ ముచ్చట తీరిపోతే..ఈ టెన్షన్ లేకుండా మరింత ఎనర్జీతో రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్ట్ తో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టొచ్చు. మరి రాబోయే మరికొద్ది గంటలోనే ఎలాంటి అనుకొని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూద్దాం.