నటుడు చలపతిరావు గారిపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ఎన్టీఆర్..!!

టాలీవుడ్ లో ప్రముఖ నటురులలో ఒకరైన చలపతిరావు ఈ రోజున ఉదయం గుండెపోటుతో మరణించారు. చలపతిరావు గారు ఎంతోమంది హీరోలతో ఎన్నో సినిమాలలో నటించారు. అలా ఎన్టీఆర్ తో కూడా ఆది వంటి సినిమాలో నటించి బాగా పేరు సంపాదించారు. దీంతో ఎన్టీఆర్ చలపతి రావు గారు మరణ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఎన్టీఆర్ అక్కడ నుంచి వీడియో కాల్ లో మాట్లాడుతూ చలపతిరావు గారి అకాల మరణం తనని ఎంతగానో కలచి వేస్తోందని తెలియజేశారు.

Sr Actor Chalapathi Rao Passes Away
అంతేకాకుండా మీరు మరణించాలనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాను” లే బాబాయి లే అంటూ” బాగోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. చలపతిరావు గారి అకాల మరణం తనని ఎంతగానో కలిసి వేసిందని నందమూరి కుటుంబం ఇవ్వాల ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని తెలిపారు. తన తాత గారి రోజుల నుంచి మా కుటుంబానికి ఎంతో అత్యంత ఆప్తుడైన చలపతిరావు గారి మృతి మా అందరికీ తీరని లోటు అని ఆయన ఆత్మ చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని ఎన్టీఆర్ తన ట్విట్టర్ నుంచి షేర్ చేశారు.

అందుకు సంబంధించి ఒక ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఆది సినిమాలో చలపతి రావు గారు అద్భుతమైన నటనని ప్రదర్శించారు.ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. ఎన్టీఆర్ తన 30 వ సినిమాకు సంబంధించి ఇంకా ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇలా యూఎస్ఏ కి వెళ్ళినట్లు సమాచారం.