2వ రోజు `ధ‌మాకా` ఊచ‌కోత‌.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన‌ తాజా చిత్రం `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్నిపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ రిలీజ్ అయింది.

తొలి ఆట నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా ఊచ‌కోత కోస్తోంది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.50 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 3.53 కోట్ల షేర్‌ను రాబ‌ట్టి అద‌ర‌గొట్టేసింది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో రూ. 9.44 కోట్ల షేర్ ను ద‌క్కించుకుంది. ఇక ఏరియాల వారీగా ధ‌మాకా రెండు రోజుల‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 3.72 కోట్లు
సీడెడ్: 1.34 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.00 కోట్లు
తూర్పు: 44 ల‌క్ష‌లు
పశ్చిమ: 40 ల‌క్ష‌లు
గుంటూరు: 59 ల‌క్ష‌లు
కృష్ణ: 45 ల‌క్ష‌లు
నెల్లూరు: 25 ల‌క్ష‌లు
———————————————-
ఏపీ+తెలంగాణ‌= 8.19 కోట్లు(13.75 కోట్లు~ గ్రాస్)
———————————————-

క‌ర్ణాట‌క+రెస్టాఫ్ ఇండియా : 65 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ : 60 ల‌క్ష‌లు
—————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 9.44 కోట్లు(9.00కోట్లు~ గ్రాస్)
—————————————–

కాగా, రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ గా నిల‌వాలంటే తొలి రెండు రోజు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ.9.56 కోట్ల రేంజ్ లో షేర్‌ను వ‌సూల్ చేయాల్సి ఉంటుంది.