నాగబాబు జబర్దస్త్ నుంచి మానేయడానికి కారణం రోజా నేనా..?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ షో కి ఒకప్పుడు నాగబాబు, రోజా జడ్జిగా వ్యవహరించేవారు. అంతేకాకుండా అషోకు ఈమధ్య చాలామంది జడ్జిగా వస్తూపోతూ ఉన్నారు. అయితే ఒకప్పుడు రోజా, నాగబాబు వీరిద్దరూ ఆ షో లో బాగా ఆకట్టుకున్నారు. కానీ ఉన్నట్టుంది ఏమైందో తెలియదు నాగబాబు గారు మొదటగా ఈ షో కి దూరమయ్యారు. తరువాత రోజా అటు రాజకీయాల్లోకి వెళ్లాలని షోకి గుడ్ బై చెప్పింది. అయితే వీరిద్దరికీ సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతోంది.

Jabardasth: Naga Babu & Roja out Temporarily or Permanent?

ఇక రోజా ఒకప్పుడు హీరోయిన్ గా పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాకుండా అప్పట్లో ఫైర్ బ్రాండ్ గా కూడా మంచి గుర్తింపు పొందింది రోజా. అయితే నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకోవటానికి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. కానీ నాగబాబు తప్పుకున్న తర్వాత రోజా కూడా కొద్ది రోజులకి ఆ షో నుంచి తప్పుకుంది. అందుకని చాలామందికి వీరిద్దరి పైన అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Roja Vs Naga Babu Roja Jabardasth Naga Babu janasena Archives

అయితే ఈ విషయంపై రోజా మాట్లాడుతూ.. నాగబాబుగారు జబర్దస్త్ షో నుండి తప్పుకోవటానికి కారణం నేను కాదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లది… దానికి షోకి సంబంధం లేదు.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి. అది ఆయన ఇష్టం నాగబాబుగారు నాతో ఎప్పుడూ చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉండేవారు.చాలా సందర్భాల్లో ఆయన నా గురించి కొన్ని విషయాలు చెప్పటం జరిగింది. ప్రొడ్యూసర్ల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ నువ్వు అని నాగబాబుగారు చాలాసార్లు నాతో అనటం కూడా జరిగింది. ఎందుకంటే ముగ్గురు మొనగాళ్లు సినిమా టైంలో ఆయనేంటో నాకు అర్థం అయింది. నేను ఏంటో నాగబాబు గారికి బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది రోజా .. కానీ నాగబాబుగారు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవటానికి నేనైతే కారణం కాదు. నేనెప్పుడూ ఆయనతో విభేదాలు పెట్టుకోలేదు. అంటూ రోజా తన మాటల్లో వెల్లడించింది.