ప్రభాస్ స్పిరిట్ స్టోరీ లీక్.. కథ వింటే గూస్ బంప్సే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం.. పాన్ ఇండియా స్టార్ గా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన లైనప్‌లో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏంటి అనగానే స్పిరిట్ పేరే గుర్తుకు వస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కాజల్, కొరియన్ యాక్టర్ డాన్లీ, కాంచన, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధానపాత్రలో మెరవనున్నారు. ఇక ప్రభాస్ స‌ర‌సన హీరోయిన్గా త్రిప్తి డిమ్రి కనిపించనుంది.

ప్రస్తుతం సినిమా షూట్ సర్వే గంగా జరుగుతున్న క్రమంలో.. 2026 ఎండింగ్ లో లేదా 2027 ప్రారంభంలో సినిమాను రిలీజ్ చేసేందుకు సందీప్ రెడ్డివంగా సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే.. సినిమాలో ప్రభాస్ ఓ పోలీస్ గెటప్ లో కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్‌గా దీనిపై మరో న్యూస్ వైరల్ గా మారుతుంది. స్పిరిట్ సినిమా ప్రధానంగా జాతీయ భద్రత సమస్యపై రూపొందుతుందట.

దేశభక్తికి సంబంధించిన యాక్షన్ డ్రామా అని సమాచారం. దేశానికి ప్రాతినిధ్యత వహించే ఓ నిజాయితీగల పోలీస్ అధికారిగా ప్రభాస్.. పవర్ఫుల్ గా కనిపించనున్నాడని.. యాక్షన్ మోడ్లో గూస్బంస్ తెప్పించేలా ఆయన రోల్ డిజైన్ చేయించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. దేశభద్రతకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అడుగడుగున ప్రభాస్ ఎలా అడ్డుకుంటాడు.. అసలు ఫైనల్ కంక్లూషన్ ఎలా ఉండబోతుంది అనే దాని చుట్టూనే సినిమా కొనసాగుతుందట‌. ఈ ఇక‌ విలన్స్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటూ తెలుస్తుంది. ఈ వార్తలో వాస్తవం ఎంతో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.