టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రాజెక్ట్‌ను ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పూజ కార్యక్రమాలు ముగించారు మూవీ టీం. ఇక వీళ్లిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్‌మెంట్ అప్పటినుంచి ఆడియన్స్‌లో మంచి అంచనాలు మొదలయ్యాయి. గతంలో వీళ్ల కాంబోలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశాడు. అయితే.. సినిమాలో డైలాగ్స్ ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయో.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే.
ఈ క్రమంలోని సినిమాపై ఆడియోస్ లో మొదటి నుంచి మంచి హైప్ మొదలైంది. త్రివిక్రమ్ దర్శకుడుగా వెంకీ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో మరింత హైప్ ఉంది. ఇలాంటి టైంలో సినిమా టైటిల్ పై రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వాటన్నింటిని బ్రేక్ చేస్తు మేకర్స్ సినిమా అఫీషియల్ టైటిల్ రిలీజ్ చేశారు. ఆదర్శ కుటుంబం టైటిల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో వెంకటేష్ బ్యాగ్ పట్టుకొని నవ్వుతూ.. ఆఫీస్ కి వెళ్తున్న ఫ్యామిలీ పర్సన్ గా కనిపించాడు. అంతేకాదు.. సినిమా టైటిల్ లో.. హౌస్ నెంబర్ 47 ఏకే 47 అంటూ క్యాప్షన్ ను జోడించడం మరింత హైలెట్గా మారింది.
ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడది వేసవిలో సినిమా రిలీజ్ చేసేలా మేకప్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా.. ప్రముఖ నిర్మాణ సంస్థ భహరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇక సినిమా ప్లానింగ్ ప్రకారం కంప్లీటై.. టైం కు రిలీజ్ అవుతుందో.. లేదో.. చూడాలి. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. టైటిల్ మాత్రం భలే క్రేజీగా ఉందంటూ.. అదిరిపోయింది అంటూ.. ఆడియన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది.



