సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ 2 తాండవం. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంతా భావించినా.. అనూహ్య కారణాలతో సినిమా ఆగిపోయింది. నిర్మాత పాత అప్పుల క్లియరెన్స్ రావాల్సింది.. కానీ వాళ్లు అప్పు క్లియర్ చేయకపోవడంతో హైకోర్టులో బ్యానర్ పై కేసు వేయడం.. సినిమా ఆపేయాలని హైకోర్టు స్టే ఆర్డర్ పాస్ చేయడం తెలిసిందే. దీంతో.. నిన్న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా వేశారు. ఇప్పటికీ ఉన్న సమస్యలు తీరేయా.. లేదా. అనేదానిపై క్లారిటీ లేదు. మరోవైపు ఫ్యాన్స్ సినిమా ఆలస్యం పై నిరసన వ్యక్తం చేస్తూ మేకర్స్‌పై మండిపడుతున్నారు.
ఇలాంటి క్రమంలోనే సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇండస్ట్రీ వర్గాలల్లో వైరల్ గా మారుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే తాజాగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడుతూ వీలైనంత త్వరలో సినిమా రిలీజ్ కాబోతుందని.. సినిమా సడన్ వాయిదా పై అభిమానులకు, సినీప్రియలకు క్షమాపణలు తెలియజేస్తున్నామంటూ పోస్ట్ ను షేర్ చేసుకున్నారు.
దీనిపై ప్రొడ్యూసర్ రామ్ అచంట రియాక్ట్ అవుతూ త్వరలోనే ఓ బ్లాక్ బస్టర్ డేట్‌తో అఖండ 2 ఆడియన్స్‌ను పలకరించనుందని ట్విట్ చేశాడు. రామ్ అచంట చేసిన ట్విట్ వైరల్ గా మారడం.. సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ అవుతుందనే టాక్ రావడంతో.. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరిగా జనవరి 12న డాకుమహరాజ్ సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ డేట్ అయితేనే అఖండ 2కు పర్ఫెక్ట్ గా ఉంటుందని.. అది కూడా బాలయ్యకు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తున్న క్రమంలో.. జనవరి 12 న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని టాక్. మరి ఈసారైనా రిలీజ్ డేట్ అమిరా ఫిక్స్ చేస్తారా.. మళ్ళీ గురి తప్పుతుందో తెలియాల్సి ఉంది.



