అఖండ సినిమా తాజాగా గ్రాండ్ లెవెల్లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ 5న రిలీజ్ కావలసి ఉండగా.. అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడి డిసెంబర్ 12 కు రంగంలోకి దిగింది. డిసెంబర్ 11 నుంచి ప్రీమియర్స్‌తో అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఇక.. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో సినిమా తెరకెక్కడం.. అఖండ లంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా రూపొందిన క్రమంలో రిలీజ్‌కు ముందు వరకు ఆడియన్స్‌లో అంచనాలు పీక్స్ లెవెల్‌లో ఉన్నాయి. అయితే.. సినిమా సగటు సినీ ఆడియన్‌ను తీవ్రంగా నిరాశకు గురి చేసిందని చెప్పాలి. ఈ క్రమంలోనే.. బాక్సాఫీస్ కలెక్షన్స్ పై కూడా ప్రభావం పడనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అఖండ తాండవం సినిమా ఓవర్సీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. థియేట్రికల్ బిజినెస్ జరిగిన మొత్తంలో పోల్చుకుంటే.. డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వచ్చే పరిస్థితి నెలకొందట. ఈ సినిమా నార్త్ అమెరికాలో కలెక్షన్లు పెద్దగా సాధించలేకపోతున్నాయని.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ట్రేడ్ వర్గాలు.. డిజిటల్ మీడియా కథనాలు ప్రకారం.. అఖండ 2 ఓవర్సీస్ రైట్ రూ.15 కోట్లకు అమ్ముడుపోయాయి. అయితే.. అనుకోకుండా రిలీజ్ డేట్ మారడంతో.. ధియేట్రికల్ రైట్స్, బిజినెస్ లెక్కలు కూడా పూర్తిగా ఛేంజ్ అయిపోయాయి. దీంతో.. బిజినెస్ లెక్కలు కూడా కొంత మొత్తానికే కుదించేసారు.
అయినా.. సినిమా బ్రేక్ ఈవెన్ పరిస్థితి దారుణంగా ఉందని.. నార్త్ అమెరికానే కాదు.. అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. అమెరికాలో అఖండ భారి నష్టాలతో ముగిసే అవకాశం ఉందట. ఇప్పటివరకు.. 800కే డాలర్లను దక్కించుకున్న ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు రూ.20 నుంచి రూ.22 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టాలి. ఆ సినిమా టోటల్ థియేటర్లో వన్ మిలియన్ డాలర్లకు మించి వచ్చే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ముందు ముందు సినిమా రిజర్వేషన్లు ఏదైనా.. వ్యత్యాసం కనబడుతుందా.. లేదా.. ఫైనల్ రన్ లో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

