సంక్రాంతి సినిమాల లిస్ట్ లో బిగ్ ట్విస్ట్.. ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఏంటంటే..?

వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో రానున్న సినిమాల విషయంలో ట్విస్ట్ ల‌పై ట్విస్ట్‌లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోజుకో సరికొత్త న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో.. ఆడియన్స్‌కు సరికొత్త గుడ్ న్యూస్.. ఒక రకంగా చెప్పాలంటే సర్ప్రైజింగ్ గిఫ్ట్ రానుంద‌ట‌. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. కానీ.. ఇటీవల కాలంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడం లేదు. కేవలం భారీ బడ్జెట్ సినిమాలను మాత్రమే సంక్రాంతి బ‌రిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. వాటి మధ్య చిన్న సినిమాలు సతమతమవుతున్నాయి. పెద్ద సినిమాలకు పోటీగా.. చిన్న సినిమాలు ధియేటర్లకు రావడానికి వెనకడుగు వేస్తున్నాయి.

కానీ.. ఈసారి మాత్రం సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు.. యంగ్ స్టార్స్ కూడా రంగంలోకి దిగనున్నారు. శ‌ర్వానంద్‌, నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. పెద్ద సినిమాల పోటీ నుంచి శర్వానంద్, నవీన్ పోలీశెట్టి సినిమాలు తప్పుకున్నాయన్న టాక్ వైరల్ గా మారింది. కానీ.. రిలీజ్ విషయంలో ఈ ఇద్దరు హీరోస్ అసలు వెనక్కి తగ్గడం లేదట. ఇక సంక్రాంతి పండుగ అంటే టికెట్ రేట్లు గుర్తొస్తాయి. మామూలుగానే.. టికెట్ హూక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గవర్నమెంట్ కూడా మేకర్స్‌ తమకు నచ్చినట్టుగా టికెట్ రేట్లు పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చేస్తుంది.

Bollywood Helpline

ఇక పండగ సీజన్ అంటే.. మరింత టికెట్ రేట్లు పెంచేస్తుంటారు. కానీ.. ఈసారి మాత్రం ఆడియన్స్‌కి ఈ విషయంలో బిగ్ సర్ప్రైజ్‌ రాబోతుందట. సాధారణంగా సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు భారీగా పెడతారు. గతంలో సింగిల్ థియేటర్లో రూ.250 నుంచి రూ.300. మల్టీప్లెక్స్ రూ.500 నుంచి రూ.600 టికెట్ ధరలు ఉన్నాయి. నిర్మాతలు గవర్నమెంట్ నుంచి స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని ఈ రేట్లు అమలు చేసేవారు. అది ఆడియన్స్ కు భారంగా మారింది. కానీ.. ఈసారి అలా కాకుండా సంక్రాంతికి ప్రేక్షకులకు సూపర్ మెగా గిఫ్ట్ ఇవ్వబోతున్నారట.

Nari Nari Naduma Murari telugu Movie - Overview

టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ లో కేవలం రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.150 కి పరిమితం చేయాలని గవర్నమెంట్ భావిస్తుందట. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో స్ట్రెక్టుగా వ్యవహరించనున్నామని.. రీసెంట్గా అఖండ 2 విషయంలో జరిగినది దృష్టిలో పెట్టుకొని ఇకపై టికెట్ రేట్లు పెంచేది లేదని.. అఫీషియల్‌గా ప్రకటించారు. ఈసారి సంక్రాంతికి ఆడియన్స్‌కు టికెట్ రేట్ల భారం తగ్గినట్లే. పండక్కి జేబులకు చిల్లు పడకుండా హాయిగా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా.. ఏపీలోను సంక్రాంతికి తక్కువ ధరలు టికెట్ రేట్లు అమలయితే.. టాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్ అవడం ఖాయమని అభిప్రాయాలు వెల్లువడుతున్నాయి.