బాలయ్య – మహేష్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఆ స్టార్ డైరెక్టర్ కారణంగా ఆగిపోయిందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు తమదైన స్టైల్‌లో కథలను నేర్చుకుంటూ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక.. నందమూరి నట‌సింహం బాలకృష్ణ చివరిగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం అఖండ 2 తాండవం షూట్‌లో బిజీబిజీగా గడుతున్న సంగతి తెలిసిందే.

మరోపక్క మహేష్ బాబు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి 29లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ వరల్డ్ రేంజ్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరికి సంబంధించిన క్రేజీ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టిస్టార‌ర్‌ సినిమాలకు ఓ రేంజ్‌లో హావా నెలకొంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అలా.. గతంలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో కూడా బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్‌ను పూరి జగన్నాథ్ ప్లాన్ చేశాడట. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంతగా ప్రయత్నాలు చేసినా.. ఇమేజ్‌కు తగ్గట్లు కథను కూడా సిద్ధం చేసిన ఇద్దరు హీరోలను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయిపోయాడు అంటూ ఓ టాక్‌ వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా సెట్స్ పైకి కూడా రాకముందే ఎండ్ కార్డ్ పడిపోయిందట. ప్రస్తుతం ఈ టాక్‌ తెగ వైరల్‌గా మారుతుంది.