ప్రభాస్ ” స్పిరిట్ ” లో స్టార్ వారసుల ఎంట్రీ.. సందీప్ వంగా ప్లాన్ ఏంటి..?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తెరకెక్కించింది అతి తక్కువ సినిమాలైనా.. ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదింకున్నాడు. తన సినిమాలతో స్క్రీన్ పై ఒక మార్క్ క్రియేట్ చేశాడు. ఇక.. ప్రస్తుతం సందీప్ వంగా పాన్ ఇండియ‌న్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్‌ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్టులలో స్పిరిట్ కూడా ఒక‌టి. ఈ క్రమంలోనే.. సినిమాపై రోజురోజుకు హైప్‌ మరింతగా పెరిగిపోతుంది.

భద్రకాళి పిక్చర్, టీ – సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్.. 2026 ఎప్రిల్‌లో సెట్స్‌ పైకి వెళ్ళనుందని సమాచారం. ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాలో మెరమనున్నాడు. యానిమల్ ఫేమ్‌ తృప్తి దిమ్రీ హీరోయిన్గా.. హర్షవర్ధన్ రామేశ్వరం మ్యూజిక్ డైరెక్టర్గా.. తరుణ్, మడోనా, సెబాస్టియన్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇలాంటి క్రమంలో.. ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే.. సినిమాలో మరో ఇద్దరు స్టార్ వారసులు భాగం కానున్నారట. వాళ్ళు ఎవరో కాదు.. త్రివిక్రమ్ కుమారుడు రిషి మనోజ్, మరొకరు రవితేజ తనయుడు మహదాన్ భూపతిరాజు.

ఎస్.. ప్రస్తుతం ఇదే టాపిక్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. స్పిరిట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా ఈ ఇద్దరు స్టార్ వారసులు పనిచేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా మహదాన్ ఇప్పటికే సందీప్ టీం లో చేరాడు అనే టాక్ తెగ వైరల్ గా మారుతుంది. రిషి మనోజ్ విషయంలో అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక.. సినిమాలో కొరియన్ యాక్షన్ స్టార్.. డాన్లీ విలన్ పాత్రలో మెర‌వ‌నున్నాడట. ఇదే వాస్తవం అయితే.. స్పిరిట్ నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామాగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ పై.. పాన్ వరల్డ్ రేంజ్‌లో హైప్‌ క్రియేట్ అవుతుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.