పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే స్పిరిట్ పేరే వినిపిస్తుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రభాస్ హీరో.. అయితే మరొకటి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు.. ప్రభాస్‌ను సందీప్ ఎంత పవర్ఫుల్ గా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ఇక సందీప్ లాంటి మోస్ట్ వాంటెడ్ దర్శకుడు కి.. రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి హీరో దొరికితే ఆ సినిమా అవుట్ ఫుట్ ఏ రేంజ్ లో ఉంటుందో కూడా ఊహకందదు. అలాంటి ప్రాజెక్ట్ స్పిరిట్.
చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమా.. రెగ్యులర్ షూట్ తాజాగా మొదలైంది. ఇక సినిమా కోసం స్టార్ యాక్టర్స్ ని సందీప్ రంగంలోకి దించుతున్నాడు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, వివేక్ ఒబేరాయ్, తృప్తి డిమ్రి ఈ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. కొరియన్ స్టార్ట్ డాన్లీ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెరవనున్నాడు. ఇక.. తాజాగా ఈ సినిమా కోసం.. మరో స్టార్‌ను సందీప్ రంగంలోకి దింపాడట. అది కూడా ప్రభాస్ తమ్ముడు రోల్లో ఆ హీరో నటించబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. దగ్గుపాటి రానా తమ్ముడు.. హీరో దగ్గుపాటి అభిరాబ్. ఎస్ పి రెడ్డి శర్మల ప్రభాస్ తమ్ముడు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని.. అలాంటి రోల్ లో ఓ స్పెషల్ స్టార్ తీసుకుంటే బాగుంటుందని సందీప్ ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే.. దగ్గుబాట్టి అభిరామ్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కనీసం కధ కూడా వినకుండా.. అభిరామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఈ క్రమంలోనే సినిమాలో ప్రభాస్ తమ్ముడి పాత్రలో అభిరామ్ ఏ మేరకు మెప్పిస్తాడో.. సినిమాను సందీప్ ఏ రేంజ్ లో రూపొందిస్తాడో అనే ఆసక్తి ఆడియన్స్ లో మొదలైంది.


