స్పిరిట్ : మూడు గెటప్స్ లో ప్రభాస్.. సందీప్ ప్లాన్ ఏంటి..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో సెన్సేష‌న‌ల్‌ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డివంగా. తాను తెర‌కెక్కించిన అతి త‌క్కువ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్ సక్సెస్‌లు అందుకుని దూసుకుపోతున్నాడు. తెలుగులో కేడి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన.. తర్వాత మరో దర్శకుడి దగ్గర పనిచేయలేదు. ఒకసారి డైరెక్టర్ గా మారిపోవాలని ఫిక్స అయ్యాడు. అలా అర్జున్ రెడ్డి సినిమాను రూపొందించి ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. త‌ర్వాత అర్జున్ రెడ్డి సినిమానే బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌గా రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నాడు.

మొదట్లో ఈ సినిమాకు అక్కడ వైలెంట్ ఫిలిమ్ అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలను మరింత స్ట్రాంగ్ చేస్తూ యానిమల్ తెర‌కెక్కించాడు సందీప్. ఈ సినిమాతో అసలైన వైలెంట్ ఫిలిం ఏంటో వాళ్లకు చూపించాడు. ఇక ప్రస్తుతం సందీప్.. ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఓ ఆడియో రిలీజ్ చేసి.. ప్రేక్ష‌కుట‌టో మరింత ఎక్సైట్మెంట్ ను పెంచేశాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు గెటప్స్‌లో కనిపించనున్నాడని టాక్‌.

ఇప్పటికే దానికి సంబంధించిన రెండు గెటప్‌లు కూడా సిద్ధం అయ్యాయి అంటూ తెలుస్తుంది. వాటిని ఫైనల్ కూడా చేసేసాడట సందీప్. ఇక ఒక్క గెటప్ మాత్రమే మిగిలి ఉంది. ప్రభాస్‌ను సందీప్ ఎలా చూపించాడ‌నే ఆశ‌క్తి అందరిలోనూ మొదలైంది. ఇక యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ కొన్ని గెటప్స్ లో కనిపించాడు. ఏజ్‌కు తగ్గట్టుగా ఆ గెటప్లను డిజైన్ చేశాడు సందీప్. ఇప్పుడు అదే మోడ్లో ప్రభాస్కు కూడా గెటప్‌లు డిజైన్ చేయనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా నెలాఖరి నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభంకానిందని సందీప్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.