టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అన్ని విభిన్నమైన జానర్లు ఎంచుకుంటూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ప్రభాస్.. ఇప్పటివరకు టచ్ చేయని జానెర్ అంటూ లేదు. మాస్ నుంచి క్లాస్ వరకు.. లవ్ స్టోరీ నుంచి పిరియాడికల్ డ్రామా వరకు.. దాదాపు అన్ని జానర్లు టచ్ చేసాడు. త్వరలో.. రాజాసాబ్తో హారర్ కామెడీ జోనర్‌ను కూడా కవర్ చేసేస్తున్నాడు. అయితే.. ఈనెల తన సినీ కెరీర్లో ప్రభాస్ ఇప్పటివరకు టచ్ చేయని ఏకైక జానర్ ఏదైనా ఉందంటే అది పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఇప్పటివరకు.. పోలీస్‌గా ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు ప్రభాస్.
ఈ క్రమంలోనే.. ఫ్యాన్స్ అయితే ప్రభాస్ పోలీస్ గెటప్‌లో ఓ సినిమాలో నటిస్తే బాగుండని ఎప్పటి నుంచి ఆరాటపడుతున్నారు. ఇక త్వరలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ ఫుల్ కాప్‌గా ప్రభాస్ కనిపించబోతున్నాడంటూ సందీప్ అఫీషియల్‌గా ప్రకటించాడు. ఇక.. తాజాగా సినిమా రెగ్యులర్ షూట్ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఆడియో టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక.. ఈ ఆడియోతోనే ప్రభాస్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్లో చేస్తున్నాడో అర్థం అయిపోతుంది.
అయితే.. తాజా సమాచారం ప్రకారం సినిమాలో మరో కీలకమైన ట్విస్ట్ ఉందట. అదేంటంటే.. ఇందులో ప్రభాస్ పోలీస్ రోల్‌కు అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఉందని.. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో మాజీ నక్సలైట్‌గా ప్రభాస్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ నక్సలైట్ పోలీస్ గా ఎందుకు మారాడు.. తర్వాత ఆయన చేసిన ఆపరేషన్ ఏంటి.. అనేది థీం స్టోరీగా తెలుస్తోంది. ఇక నక్సలైట్, పోలీసులంటేనే.. పాము, ముంగిసలు టైప్. నక్సలైట్లు.. పోలీసులపై బాంబులు దాడులు చేయడం, పోలీసులు.. నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయడం లాంటి వార్తలు ఇప్పటికే ఎన్నో వందల్లో విన్నాం. అలా.. రెండు విభిన్నమైన శత్రుత్వ వృత్తులను ఒకే మనిషి చేయడమేంటి.. అనే అంశమే ఆడియన్స్ లో ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఇలాంటి కథకు డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా తన స్టైల్లో డిజైన్ చేశాడంటే.. అది ఏ రేంజ్లో ఉంటుందో ఊహకు కూడా అందదు. ఇక ప్రభాస్‌కు ఇలాంటి రోల్ ఎంతవరకు కలిసి వస్తుందో.. ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.



