కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో కెరీర్‌ను ప్రారంభించిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని అక్కడ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. ఇది కేవలం కన్నడ ఏరియాలో మాత్రమే రిలీజ్ కావడంతో.. ప్రశాంత్‌కు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే మంచి ఇమేజ్ వచ్చింది. ఇక నీల్ తర్వాత ప్రాజెక్ట్ కేజిఎఫ్ చాప్టర్ 1తో దశ తిరిగిపోయింది.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. దాదాపు అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది. ప్రశాంత్ నిల్‌కు తిరుగులేని క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత.. కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. దీంతో.. క్రేజ్ డబల్ అయింది. ఇక కొంతకాలం క్రితం.. రెబెల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ పార్ట్ 1 రిలీజ్ చేసి.. ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అలాంటి ఓ సెన్సేషనల్ డైరెక్టర్.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ప్రతి సినిమాను డార్క్ మోడ్‌లోనే రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్‌తో రూపొందించనున్న సినిమా సైతం డార్క్ మోడ్ లోనే తెరకెక్కనుందట. ఇక.. ప్రతి సినిమా విషయంలోనూ నీల్ ఇదే రొటీన్ ఫార్ములాను వాడడంతో.. ఎన్టీఆర్ విషయంలో ఈ ఫార్మాట్ అసలు వర్కౌట్ అవుతుందా.. లేదా.. స్టోరీ ఎలా ఉండబోతుంది.. అనే టెన్షన్ ఫ్యాన్స్ లో మొదలయింది.



