NBK 111: గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన గోపీచంద్.. గాడ్ ఆఫ్ మాస్ ఎస్ బ్యాక్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవం.. షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి డైరెక్షన్‌లో అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా తెర‌కెక్క‌నున్న క్రమంలో.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక.. బాలయ్య నెక్స్ట్ సినిమాను గోపీచంద్ మలినేనీ డైరెక్షన్‌లో నటించనున్నాడు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై క్రేజీ అప్డేట్ ఇస్తూ ఆడియన్స్‌లో హైప్‌ పెంచుతున్నాడు గోపీచంద్.

సినిమాలో హీరోయిన్గా నయనతార మెరవనుంది. ఇక ఈ మూవీలో డ్యూయల్ రోల్లో నటించనున్న బాలయ్య.. ఓల్డ్ గెటప్ లో చేసే సీన్స్, ఇంటర్వెల్ కు వచ్చే ఎపిసోడ్స్ సినిమాకి హైలెట్గా నిలవనున్నాయని సమాచారం. అంతేకాదు.. రాజస్థాన్‌లోని కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారట. ఇప్పటికే.. అక్కడి లొకేషన్స్ కన్ఫర్మ్ చేసిన గోపీచంద్.. బాలయ్య పై ఫ్యామిలీ సీన్స్‌తో పాటు.. యాక్షన్ స‌న్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ పిరియాడికల్ స్టోరీ లో బాలకృష్ణ మహారాజు పాత్రలోను మెరవనున్నాడు. ఇక ఎప్పుడు తన సినిమాల్లో శివుడితో డివోషనల్ టచ్ ఇచ్చే బాలయ్య.. ఈసారి అమ్మవారిని నమ్ముకున్నాడు. ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని తాజాగా తన ఎక్స్ వేదికగా క్రేజీ అప్డేట్ రివిల్ చేస్తూ.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేశాడు. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది.. బాలకృష్ణతో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా గాడ్ ఆఫ్ మాసెస్ ఇజ్ బ్యాక్ అంటూ రాసుకోచ్చాడు. ప్రస్తుతం గోపీచంద్ పోస్ట్‌తో పాటు.. పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.