కొలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడుపదులు వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన నటన, క్రేజ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక.. ప్రస్తుతం జైలర్ 2 సినిమా పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు రజినీ. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తలైవా 173 ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ఇప్పుడు ఊహించని ట్విస్ట్‌లకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచింది. దాదాపు.. నాలుగు దశాబ్ధాల తర్వాత రజనీకాంత్.. కమల్ కలిసి పని చేయబోతున్నారు. అయితే.. కమల్ హాసన్ నటుడిగా కాదు.. ఈ సినిమా ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు. తన ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్స్ పై ఈ సినిమా రూపొందనుంది.

అయితే.. మొదట ఈ సినిమాకు.. డైరెక్టర్ సుందర్ .సీ ని అనౌన్స్ చేసినా.. తర్వాత దర్శకుడుగా సినిమా నుంచి ఆయనను తొలగించి ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే దీనిపై ఇటీవల సినిమా ప్రొడ్యూసర్ కమలహాసన్ రియాక్ట్ అవుత.. సుందర్.సీ తన నిర్ణయానికి గల కారణాలను ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేశారని.. ఇక నేను ప్రొడ్యూసర్ గా రజనీకాంత్ బాగా నమ్మి.. ఆయనకు నచ్చిన కథతోనే సినిమా తీయాలని భావిస్తున్నా అంటూ క్లారిటీ ఇచ్చాడు. రజనీకాంత్ కు నచ్చేంత వరకు మేము కథల వేట కంటిన్యూ చేస్తామనీ.. ఈ సినిమాకు దర్శకుడుగా ఓ యంగ్ డైరెక్టర్ కూడా సెలెక్ట్ కావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.
ఆయన ఈ సినిమాకు యువ దర్శకుడు దర్శకుడు పని చేయబోతున్నాడని చెప్పకనే చెప్పేసాడు అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక సుందర్ సి తప్పకున్న తర్వాత ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరిస్తున్నారంటూ ఎంతో మంది పేర్లు వినిపించిన.. తాజాగా ఆ ప్లేస్లోకి కోలివుడ్ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్.. ధనుష్ పేరు స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ధనుష్ తలైవా 173 డైరెక్షన్ బాధ్యతలు అందుకున్నాడంటూ సమాచారం. ఇప్పటికే తలైవర్ 173 టీం డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాలని ధనుష్ ను అప్రోచ్ అయ్యారట. ఇక ధనుష్ పా పండి, రాయన్, ఇడ్లీ కడామి లాంటి సినిమాలు కు దర్శకుడుగా వ్యవహరించి మంచి రిజల్ట్ అందుకున్నాడు. అంతేకాదు.. ధనుష్ మొదటి నుంచి రజినీకాంత్ ఫ్యాన్ బాయ్ గా ఆయనను తెగ అభిమానిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే.. ధనుష్ కు అవకాశం వచ్చిందట. ఇక ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే.. అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

