ప్రభాస్ కారణంగా టార్చర్ చూశా.. చాలా నష్టపోయా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..! 

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాలు నటిస్తే బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ప్రభాస్ కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా.. ప్ర‌భాస్ ఈ రేంజ్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్క‌డానికి కేవలం సినిమాలే కాదు.. ఆయన వ్యక్తిత్వం కూడా ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఇప్పటికి ఆయనతో పనిచేసిన ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి గర్వము లేకుండా ఎదుటివారి పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటాడని చెప్పుకొచ్చారు.
ప్రభాస్ వల్ల నా జీవితానికి కోలుకోలేని దెబ్బ తగిలింది: నిత్యామీనన్ | heroine nithya  menen comments on rebal star prabhas - Telugu Oneindia
అలాంటి ప్రభాస్‌తో సినిమా చేయాలని ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ సైతం ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో.. ఓ స్టార్ బ్యూటీ మాత్రం ప్రభాస్ కారణంగా చాలా నష్టపోయానని.. టార్చర్ చూశాను అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఆమె మరెవరో కాదు.. నిత్యామీనన్. ఎస్.. స్వయంగా నిత్యమీనన్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను షేర్ చేసుకుంది. తను సినీ కెరీర్‌లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ అలా మొదలైంది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో నాని హీరోగా వ‌చ్చిన ఈ సినిమాలో నేను హీరోయిన్గా చేశా.
nithya menen facebook « Telugu Movie Database
ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో నాకు ప్రభాస్ గురించి ఒక ప్రశ్న ఎదురయింది.. అయితే ప్రభాస్ ఎవరో నాకు నిజంగానే తెలియదు.. దాన్నే ఓపెన్ గా చెప్పా. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను విపరీతంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. చాలా చాలా ఇబ్బందికి గురి చేశారు అంటూ చెప్పుకొచ్చింది. అప్పటికి నా వయసు చాలా చిన్నది కావడంతో.. నాకు తెలియని విషయమే కదా.. నేను తెలియదని చెప్పాను ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు.. టార్చర్ చేస్తున్నారని మెంట‌ల్ స్ట్రెస్‌కు లోన‌య్య‌.. అంటూ ఇంటర్వ్యూలో నిత్య మీనన్‌ వివరించింది. ఇక ప్రస్తుతం మరోసారి నిత్యామీనన్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.