టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందట. ఇప్పటికే.. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక.. చికరి సాంగ్ అయితే సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమాను చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. వచ్చే ఏడాది మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆర్ సి 17 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందింది.
ఈ క్రమంలోనే.. చరణ్ నెక్స్ట్ మూవీపై కూడా ఇప్పటికే బజ్ మొదలైపోయింది. ఇక.. వీళ్లిద్దరి కాంబోలో గతంలో వచ్చిన రంగస్థలం క్లాసికల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే.. మళ్లీ వీళ్ళిద్దరి కాంబోలో ఎలాంటి స్టోరీ రాబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఊహాగానాలను నెట్టింట వైరల్ అవుతున్నాయి. రంగస్థలం విలేజ్ బ్యాక్ డ్రాప్ పిరియాడికల్ ఫిల్మ్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. చరణ్ నటిస్తున్న పెద్ది కూడా ఇదే విలేజ్ బ్యాక్ డ్రాప్లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది.

కానీ.. ఆర్సి 17 మాత్రం ఈ రెండు సినిమాలతో అసలు సంబంధమే ఉండదని.. ప్రజెంట్ టైమ్‌లో మోడరన్ కథంశంతో తెరకెక్కనుందని సమాచారం. ఇక.. తాజాగా మైత్రి మేకర్స్ రవిశంకర్ ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్స్‌లో ఈ సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. చరణ్.. సుకుమార్ రేంజ్ కు తగ్గ ఓ అద్భుతమైన కథతో సినిమా ఉండబోతుందని వివరించాడు. ఈ మూవీలో చరణ్ లుక్ అల్ట్రా స్టైలిష్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రంగస్థలం ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టిస్తుంది అంటూ ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


