అఖండ 2: సనాతన ధర్మ వైభవం ఏంటో చూస్తారు..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో.. సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్‌బ‌స్టర్ల తర్వాత వస్తున్న మూవీ అఖండ 2 తాండవం. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుండడం.. థ‌మన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మరింత హైప్ పెరిగింది. ఇప్పటివరకు.. సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ లుక్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచలా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ తరుణం వచ్చేసింది. శుక్రవారం (నిన్న) సాయంత్రం ముంబైలో గ్రాండ్ గా ఈవెంట్ ను ప్లాన్ చేసి మరి సినిమా ఫస్ట్ సింగిల్ తాండవం ను రిలీజ్ చేశారు మేకర్స్.

AKHANDA THANDAVAM Video Song | Akhanda2 | Balakrishna | BoyapatiSeenu | SSThaman | Pragya Jaswal - YouTube

ఇక.. ఈ పాటలో.. బాలకృష్ణ అఘోర అవతారంలో చేసిన శివ తాండవం.. థ‌మన్‌ మ్యూజిక్ పాటకు డివైన్ టచ్ ను తీసుకు వచ్చాయి. రంగ రంగ సంబులింగ.. ఈశ్వర.. అంతరంగా.. హే భుజంగా.. శంకర అంటూ సాగిన ఈ పాట శివుడి మహత్తును కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరిస్తూ సాగింది. శంకర మహదేవన్, కైలాష్‌ఖేర్ ఈ పాటను ఆలపించారు. ఇక ఈ సాంగ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూ సనాతన ధర్మం యొక్క శక్తి పరాక్రమాలను ఈ సినిమాలో చూడబోతున్నారని.. ధర్మంగా బ్రతకండి, సత్యంగా మాట్లాడండి, అన్యాయానికి తలవంచకండి.. ఇదే అఖండ 2 తాండవం సారం అంటూ చెప్పుకొచ్చాడు.

మన దేశం తాలూకా వేద సంస్కృతి, భారతదేశ ఆత్మను ఈ సినిమాలో ఆవిష్కరించామ‌ని.. సినిమాలోని కొన్ని సీన్స్ మైనస్ 12 డిగ్రీస్ లో షూట్ చేశామని వెల్లడించాడు. ఇక మా సినిమాకు శివుడే దారి చూపించాడని.. డైరెక్టర్ బోయపాటి శ్రీను వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్‌తో పాటు.. ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడుతూ సినిమాపై హైప్‌ను పెంచారు. ఇక సాంగ్‌ సైతం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. ఇక డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్‌లో అఖండ 2 రిలీజ్ కానున్న నేప‌ద్యంలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. మరోసారి బాలయ్య ఖాతాలో బ్లాక్ బస్టర్ పడుతుందో.. లేదా చూడాలి.