టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల బాక్సాఫీస్ దగ్గర వరుస సక్సెస్‌లు అందుకుని.. మంచి జోష్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య నెక్స్ట్ అఖండ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి క్రమంలో దాదాపు 2025 ఎండింగ్ రానే వచ్చేసింది. ఈ ఏడాది చాలా భారీ అంచనాలతో ఎన్నో సినిమాలు తెరకెక్కయి కొన్ని హీట్లుగా నిలవగా.. మరికొన్ని ప్లాపులు అయ్యాయి. కానీ.. ఓపెనింగ్ డే కలెక్షన్లతోనే తమ సినిమా మార్క్‌ను రెండే రెండు సినిమాలు చూపించాయి. ఇక ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర డే 1 లో రూ.100 కోట్ల క్లబ్లో చేరడం అనేది సరికొత్త బెంచ్ మార్క్. ఈ ఏడాది ఆ మార్క్‌ను టచ్ చేసినవి రెండే సినిమాలు. వాటిలో కోలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ ఒకటి.
![]()
లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా.. రిలీజ్‌కి ముందు ఆడియన్స్‌లో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే మొదటి రోజు రూ.100 కోట్లకు పైగా ఓపెనింగడ్స్ దక్కించుకుంది. కాగా ఫుల్ రన్లో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఓపెనింగ్స్ మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. ఇక రెండో సినిమా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ. ఈ సినిమా మానియాకు.. సుజిత్ స్టైలిష్ టేకింగ్ తోడవడంతో.. ఓజీకి కూడా మొదటి రోజు రూ.100 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కాగా.. ఇప్పుడు 2025 ముగింపు దగ్గరకు వచ్చేసింది. ఈ క్రమంలోనే.. అందరి కళ్ళు ఒకే ఒక్క సినిమాపై ఉన్నాయి. అదే డిసెంబర్ 5న రిలీజ్ కానున్న బాలకృష్ణ అఖండ 2.
అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో.. అసలు హిట్ అవుతుందా.. లేదా ఫ్లాప్ గా మిగిలిపోతుందా. ఫస్ట్ టైం రూ.100 కోట్ల టచ్ చేసి డే 1 రికార్డ్ల క్లబ్లో మూడవ సినిమాగా మారుతుందా లేదా.. అనే ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం అఖండకు పాజిటివ్ వైబ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇది ఒక నార్మల్ సీక్వెల్ గా కాకుండా.. ఒక సెన్సేషనల్ సీక్వెల్ గా తెరకెక్కుతుంది. బాలయ్య అఘోర గెటప్ క్రేజ్ గురించి, బోయపాటి – బాలయ్య కాంబో ఫ్యాన్ బేస్ గురించి బాలయ్య ఎలివేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు.. థమన్ మ్యూజిక్ మరో హైలెట్. ఈ క్రమంలేనే క్రేజ్‌కు తిరుగులేదని.. కచ్చితంగా అఖండ 2 తాండవంతో రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


