టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 9.. ప్రస్తుతం రసవత్తరంగా సాగుతుంది. ఇక.. ఈ సీజన్ తుది దశకు చేరుకుంది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో రణరంగంలోకి దిగండి.. గెలిచి చూపించండి.. అని భారీ డైలాగ్స్ వదులుతూ.. నయా టాస్క్ ప్రారంభించాడు బిగ్ బాస్. ఇక.. ఈ గేమ్‌లో మొదటి రోజు గట్టి పోటీ తోనే కంటెస్టెంట్లు తమ ఆటను చూపించారు.
ఈ టాస్క్ కోసం మొట్టమొదట హౌస్ లోకి బిగ్బాస్ 7 కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ అడుగు పెట్టాడు. రావడంతోనే తనుజతో రొమాంటిక్ సాంగ్. లవ్ సాంగ్ డ్యాన్స్ చేసి.. అనంతరం ఎమ్మెల్యేలతో గేమ్ లో పాటిస్పేట్ చేశాడు. ఈ ఆటలో.. ఇమ్ము సక్సెస్ అయ్యాడు. ఇక.. తర్వాత హౌస్‌లో కాసేపు కంటెస్టెంట్ల మధ్యన కన్వర్జేషన్ గొడవలు చూపించారు. తర్వాత రోజు ఉదయం.. హౌస్ లోకి బిగ్బాస్ 7 కంటెస్ట్ ఎంట్రీ ఇచ్చింది.

శోభతో.. దివ్య పోటీపడి సక్సెస్ అందుకుంది. తర్వాత బిగ్బాస్ 4 ఫైనల్ కంటెస్టెంట్ సోహెల్ ఎంట్రీ ఇచ్చి హౌస్ లో సరికొత్త ఎనర్జీని నింపాడు. కాసేపు హౌస్ లో ఈ కాన్వర్జేషన్ తర్వాత సోహెల్‌తో ఆట ఆడి రీతూ, సోహెల్ గెలిచారు. అలా.. చివరి కెప్టెన్సీ కోసం కళ్యాణ్, పవన్, దివ్య, ఇమ్ము, సంజన, రీతులు పోటీపడ్డారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. క్యాప్టెన్సీ గేమ్‌లో చివరి రౌండ్‌లో డిమోన్, ఇమ్ము నిలిచారట. ఈ పోటీలో ఇమ్మని ఓడించి డిమొన్ సక్సెస్ అయ్యాడని.. ఫైనల్ కాప్టన్ గా పవర్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.


