టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవం షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య నటిస్తున్న నాలుగవ సినిమా కావడం.. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబొలో తెరకెక్కిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్ మొదలైంది. దానికి తోడు.. ఆఖండ లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న క్రమంలో అఖండ 2 కోసం.. కేవలం అభిమానులే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక.. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్న మరో విషయం థమన్ మ్యూజిక్.. బాలయ్యను ఎలివేట్ చేయడంలో థమన్‌ను కొట్టేవారు మరొకరు లేరు. ఈ క్రమంలోనే.. బాలయ్య సైతం తన వరుస సినిమాలకు ఆస్థానం మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ ను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు.
ఇక.. ఈ సినిమాని డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలనుకున్నాయి. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక ఫస్ట్ సింగల్ ఎప్పుడు వస్తుంది.. అసలు సినిమాల్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి.. అవి ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారు.. సినిమా ప్రమోషన్స్ని ఇప్పటికే మొదలు పెట్టాల్సింది.. ఇంకా ఎలాంటి అప్డేట్లు ఇవ్వడం లేదంటూ ఫ్యాన్స్ నుంచి సందేహాలు వ్యక్తం అవుతున్న క్రమంలో.. తాజాగా మూవీ సాంగ్స్‌కు సంబంధించిన టాక్ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఆల్బమ్ లో థమన్ పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేకుండా పోయిందని.. చాలా తక్కువ నాటలే ఉన్నాయంటూ సబాచారం.

రిలీజ్ డేట్ కు మరో 20 రోజులు మాత్రమే సమయం ఉన్నా.. ఇప్పటివరకు కనీసం ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ క్రమంలోనే ఆ టాక్ నిజమే అని ఫ్యాన్స్ సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సాంగ్స్ విషయంలో థమన్ మ్యూజిక్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేమని.. నిరాశ కొంతమంది అభిమానుల్లో కనిపిస్తున్నా.. మరి కొంతమంది మాత్రం థమన్ ఎక్కడ డిసప్పాయింట్ చేయడని.. బాలయ్యను ఎలివేట్ చేసే ఏ చిన్న ఛాన్స్ కూడా మిస్ చేసుకోడని.. స్కోప్ ఉన్న ప్రతిచోట బాలయ్యను నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తాడంటూ ధీమ వ్యక్తం చేస్తున్నారు. మరి.. సినిమా మ్యూజిక్ పరంగా ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో.. అభిమానుల అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర అఖండ తాండవం చూపిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


