సౌత్ మ్యూజిక్ సెన్సేషన్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనిరుధ్ రవిచంద్రన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. పేరుకు తమిళియన్ అయినా.. అడపాదడపా తెలుగు సినిమాలకు సైతం పని చేసి ఇక్కడ ఆడియన్స్ కు కూడా దగ్గర అయ్యాడు. రీసెంట్ టైంలో కింగ్డమ్ తో పలకరించిన అనిరుధఖ.. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. అనిరుధ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెటింట వైరల్‌గా మారుతుంది. త్వరలోనే.. అనిరుధ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడని వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక.. ఆ వార్తలు నిజమే అన్నేలా.. తాజాగా ఓ వీడియో రిలీజై తెగ వైరల్ గా మారుతుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా రాణిస్తున్న అనిరుధ్.. ప్రస్తుతం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో హీరోయిన్ ఆండ్రియాతో రిలేషన్‌లో ఉన్నాడంటూ వార్తలు వినిపించినా.. తర్వాత వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిపోయింది. కాగా ఇటీవల కాలంలో మాత్రం.. అనిరుధ్ సన్రైజర్ హైదరాబాద్ ఓనర్.. హీరోయిన్ కావ్య మారన్‌ను పెళ్లి చేసుకున్నాడు అనే రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. వాటిపై రియాక్ట్ అయిన అనిరుధ్.. అలాంటిదేమీ లేదు చిల్ గాయ్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ.. ఇప్పుడు మరోసారి కావ్య తో అనిరుథ్ ట్రిప్‌కు వెళ్తూ కనిపించడం కొత్త సందేహాలకు కారణం అవుతుంది.
![]()
యూకేకు చెందిన ఒ య్ఊట్యూబర్ బ్లాగ్ప్ తీస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా అతని వీడియోలో.. అనిరుధ్, కావ్య జంట కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అంటే.. ఇద్దరు కలిసి వెకేషన్‌కు వెళ్ళి ఉంటారని.. గతంలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలు కూడా వాస్తవమే కావచ్చు.. అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. అనిరుధ్.. త్వరలోనే కళానిధి మారన్‌కు అల్లుడు కాబోతున్నాడు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అనిరుధ్, కావ్య.. ఇద్దరు సింగిల్ లైఫ్ ఏంటో చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరి ప్రేమ నిజమైతే.. పెళ్లి వార్త ఎప్పుడు చెప్తారో చూడాలి.


