నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శీను డైరెక్షన్‌లో నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. ఇక.. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే మంచి అంచనాలను నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే.. అఖండ 2 కోసం బాలయ్య కెరీర్‌లోనే ఫస్ట్ టైం ఆధునిక సాంకేతికతను వాడనున్నారని తెలుస్తుంది. అదే 3D వర్షన్. కేవలం బాలయ్య కాదు ఇప్పటివరకు.. సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లు కూడా ఈ టెక్నాలజీ తో ఒక్క సినిమా చేయలేదు.
చిరంజీవి నుంచి జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ కు 3డి వాడినా.. అది పెద్దగా అతకలేదు. సబ్ టైటిల్స్ ముందుకు చొచ్చుకు వచ్చాయి తప్ప.. సినిమాలో ఎలాంటి ఫీల్ లేదు. దీని బట్టి ఒరిజినల్ 3D కన్వర్షన్ గా ఆ సినిమాను భావించలేం. కానీ.. అఖండ 2 మాత్రం అలా కాదు.. ఫుల్ ఆఫ్ న్యూ టెక్నాలజీను వాడి.. 3Dలో రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాకు ప్రదర్శించిన కొన్ని శాంపిల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని.. ఒకవేళ ఫుల్ వర్షన్ ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం కచ్చితంగా రికార్డుల మూత మోగిపోవడం కాయమంటూ టాక్. అఖండ 2 ఈసారి నార్త్ మార్కెట్ ను స్ట్రాంగ్ గా టార్గెట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ సైతం ముంబైలో ప్రారంభించారు.
అఖండ 1కు ఓటిటిలో నార్త్ సినీ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ దృష్ట్యా.. సీక్వెల్ కోసం కూడా బలమైన థియేటర్ ప్లానింగ్ మొదలుపెట్టారట. అందులో భాగంగానే.. 3D ద్వారా ఆకట్టుకునే ప్రయత్నాలు టీం చేస్తున్నారు. దీనికోసం.. మరింత బడ్జెట్ కేటాయించ టానికి నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంక 19 రోజులు మాత్రమే టైం ఉండడంతో.. టీం పబ్లిసిటీ పై దృష్టి సారించారు. సనాతన ధర్మాన్ని ఆవిష్కరించే ఈ సినిమా.. పర్ఫెక్ట్ 3D వర్షన్‌లో రూపొందితే మాత్రం.. ఆడియన్స్‌కు మర్చిపోలేని ఫీల్ ను కలిగిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాకు.. 21న కర్ణాటకలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అంతకన్నా ముందు వైజాగ్ లో మరో సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉందని సమాచారం. ఇక డిసెంబర్ 4 రాత్రి నుంచే అభిమానుల కోసం స్పెషల్ ప్రీమియర్లు వేసే ఆలోచనలో టీం ఉన్నారట.



