‘ అఖండ 2 ‘ రెమ్యూనరేషన్ లెక్కలివే.. ఎవరికి ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే భారీ క్రేజ్‌తో పాటు.. బిగ్గెస్ట్ బడ్జెట్‌లో రూపొందుతున్న‌ సినిమా అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు తాను నటించినా ఏ సినిమాకు ఈ రేంజ్‌లో మార్కెట్ కూడా జరగలేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సినిమాకు దాదాపు రూ.180 కోట్లకు పైగా ఖర్చయిందట. అంతేకాదు.. ప్రింట్‌, పాన్ ఇండియన్ పబ్లిసిటీ, వడ్డీలు ఇవన్నీ మరింత బడ్జెట్‌ను పెంచేస్తున్నాయి. కేవలం.. రెమ్యున‌నరేషన్లకే రూ.100 కోట్ల వరకు మేకర్స్ కేటాయించినట్లు తెలుస్తుంది.

ఇంతకీ.. అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్లు ఎవరు తీసుకున్నారు.. ఆ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినిమా కోసం డైరెక్టర్ బోయపాటి శ్రీను రెమ్యూనరేషన్ దాదాపు రూ.45 కోట్లు ఛార్జ్ చేశాడట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌. ఇక ఈ సినిమా కోసం బాలయ్య సైతం రూ.45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అడుగుతున్నారని టాక్. ఈ వివరాల ప్రకారం చూస్తే.. కేవలం హీరో, దర్శకుల రమ్యునరేషన్లకే రూ.75 కోట్లకు పైగా ఖర్చు అయిపోతుంది.

ఇక.. మిగిలిన నటీనటుల‌, మ్యూజిక్ డైరెక్టర్స్‌, సినిమాటోగ్రఫీ, హీరోయిన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్‌ డిపార్ట్మెంట్ ఇలా అన్ని రంగాల స్టాఫ్ మొత్తానికి కలిపి రూ.100 కోట్లు బడ్జెట్ ఈజీగా అయిపోతుంది. ఇక.. ఈ మూవీకి భారీ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఉండనే ఉంది. సిజి వర్క్‌ల‌ని.. సినిమా షూట్ కోసం పాన్ ఇండియా లెవెల్ లోకేషన్లను చూజ్‌ చేసుకోవడం అని.. పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకోవడం.. భారీ ఫైట్ సీన్స్.. ఇలా చాలా బడ్జెట్ ఖర్చు అయింది. అందుకే.. వర్కింగ్ డేస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక.. బోయపాటి శీను సినిమాలంటేనే ఖర్చుతో కూడుకున్నవి.

Akhanda 2 Song Launch: Balakrishna's Power-Packed Musical Reveal | First  Song from Akhanda 2 Unveiled | Full Launch Highlights | Akhanda 2 Music  Launch: High-Octane Track Goes Viral | Akhanda 2 Latest

అందుకే.. ఎంత లేదన్న రూ.250 కోట్లకు పైగా మిగతా ఖర్చులు అయినట్లు తెలుస్తుంది. ఇలా.. చాలా భారీ మొత్తంలో ఖర్చు అయినా ఈ సినిమా మార్కెట్ కూడా అదే రేంజ్ లో ఉందట. థియేట్రిక‌ల్‌ మార్కెట్ వరల్డ్ వైడ్ గా రూ.120 కోట్లకు పైగానే వినిపిస్తుంది. అంతేకాదు.. బాలీవుడ్ రిలీజ్‌ నేరుగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పటికే ముంబైలో అఖండ 2 ప్రమోషన్స్ ప్రారంభించేశారు. అలా ఇప్పటికే అక్కడి ఆడియన్స్‌లో ఈ సినిమాపై హైన్‌ మొదలయిందని.. నాన్‌థియేట్రికల్ అమ్మకాలు భారీ లెవెల్‌లో జరగబోతున్నాయని సమాచారం. ఇక.. ముందు ముందు సినిమా మార్కెట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.