అఖండ 2 రిలీజ్ బై బిగ్ సస్పెన్స్.. సంక్రాంతికి బాలయ్య – చిరు క్లాష్ తప్పదా..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్య నుంచి రానున్న మోస్ట్ ప్రస్టీజియ‌స్‌ ప్రాజెక్ట్ అఖండ 2తో పాటు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలను నెలకొన్నాయి. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కావడంతో సినిమాపై అంచనాలు అంతకంత‌కు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ డబ్బింగ్ పనులు కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్స్ సరవేగంగా జరుపుతున్నారు టీం. ఇక సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు.

The Raja Saab, Akhanda 2 and MSG yet to close OTT deals | Telugu Cinema

అయితే.. ఇప్పుడు రిలీజ్ డేట్ సస్పెండ్స్ నెలకొంది. కేవలం రిలీజ్‌కు ఇంకా 20 రోజులు మాత్రమే నిలుచున్నా.. సినిమా ప్రమోషన్స్‌ను మాత్రం టీం ప్రారంభించకపోవడంతో రిలీజ్‌కు లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ఇండస్ట్రియల్ టాక్ ప్రకారం ఇప్పుడు అఖండ మేకర్స్‌ సంక్రాంతి రిలీజ్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 9న ప్రభాస్ రాజాసాబ్‌ సినిమా రిలీజ్ కానుంది.

అయితే.. ఈ సినిమా పనులు ఇంకా కంప్లీట్ కాలేదని.. దీంతో ఆ స్లాట్‌ను అఖండ 2 ఆక్యుపై చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఇదే వాస్తవమైతే మాత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య వర్సెస్ చిరు బాక్సాఫీస్ క్లాష్‌ తప్పదనే చెప్పాలి. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను.. ఏదేమైనా సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే టీం అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే.. బాలయ్య వర్సెస్ చిరు క్లాష్‌ ఉంటుందా.. లేదా.. అఖండ 2 రిలీజ్ డేట్ పైనే ఆధారపడి ఉంది.