ఇండస్ట్రీ ఏదైనా సరే.. స్టార్ హీరోల అభిమానుల మధ్యనే ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే ప్రశ్న నెంబర్ 1 హీరో ఎవరు. ఇక.. టాలీవుడ్ లో అయితే ఈ అంశంపై ఎప్పటికప్పుడు బార్లు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరంటే.. మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆయన తర్వాత ఈ జనరేషన్ హీరోల్లో నెంబర్ 1 ఎవరనే ప్రశ్నలకు.. ఎవరి నుంచి ఒక పర్ఫెక్ట్ క్లారిటీ రాదు. కారణం.. ప్రతి అభిమాని తాము ఇష్టపడుతున్న హీరోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎవరి ఫేవరెట్ హీరో పై వాళ్లకు ఓ ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది.
కాగా.. టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు అనే ప్రశ్నకు క్లియర్ కట్‌గా AI క్లారిటీ ఇచ్చేసింది. కేవలం చాట్ జిపిటి కాదు, ప్రో సిటీ, జెమినీ లాంటి ఎన్నో ప్రముఖ AI టూల్స్ కూడా ఒకే పేరును చెబుతున్నాయి. అదే రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ప్రభాస్‌నే ఈ నెంబర్ 1 గా చెప్పడానికి కారణం ఇంటర్నేషనల్ ఇమేజ్, భారీ ప్రాజెక్ట్స్, సోషల్ మీడియా ట్రెండ్, క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్. వీటన్నింటినీ బేస్ చేసుకుని ప్రభాస్ ఏ నెంబర్ 1 హీరో అని తెల్చింది AI. దేశవ్యాప్తంగా అభిమానులతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు సోషల్ మీడియాలో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్ తోనే ప్రస్తుతం ప్రభాస్ సాలిడ్ నెంబర్ 1 హీరోగా కనిపిస్తున్నారు.
ఇక AI నెంబర్ 2 హీరోగా అల్లు అర్జున్ ను గుర్తించింది. నెంబర్ 3 పోసిషన్ లో మహేష్ బాబు నిలిచాడు. నాలుగు, ఐదు పొజిషన్లో విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా.. చరణ్, ఎన్టీఆర్ ల మధ్యన కాస్త పోటీ కనిపిస్తోంది. ఇక AI ప్రకారం.. ఎన్ని ఫ్యాన్ వార్లు జరిగినా ప్రభాస్ నెంబర్ 1 హీరో అట. ఈ ర్యాంకింగ్ ఫ్యాన్స్ అభిప్రాయాలకంటే భిన్నంగా ఉన్నా.. ఏఐ సమాధానాలు మాత్రం టాలీవుడ్ పరిస్థితులను అంచనాలు వేస్తూ.. హీరోలకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, సోషల్ మీడియా ట్రెండ్స్ ఆధారంగా రిజల్ట్ చూపిస్తుంది. కనుక.. ప్రస్తుతం AI రిలీజ్ చేసిన ఈ స్టార్ హీరోల లిస్ట్ హాట్ టాపిక్ గా మారింది.



