టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ పై ఇప్పటికే ఆడియన్స్లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో అనిల్ వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నాడని.. ఇప్పటికే ఫ్యాన్స్ లో క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. అంతేకాదు.. నయనతార సినిమాలో హీరోయిన్గా మెరువనుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ఆకట్టుకుంటుంది.

ఇక.. ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్టులు ఎవరితో చేయబోతున్నాడు.. తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. చిరంజీవి లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉందని.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు క్రేజీ స్టార్ డైరెక్టర్లతో ఆయన సినిమాను ఫిక్స్ చేసినట్లు టాక్ వైరల్‌గా మారుతుంది. వారిలో శ్రీకాంత్ ఓద్దెల ఒకరి కాగా.. మరొకరు బాబి కొల్లి, ఇక చిరంజీవి తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కూడా ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడటని.. సోషల్ మీడియాలో టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇక బాబీ – చిరంజీవి కాంబోలో ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాతో పాటే.. శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్‌లో మరో సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని ఈ సినిమా ప్రొడ్యూసర్. కాగా.. ప్రస్తుతం ది పారడైజ్ మూవీ ప్రాజెక్టులో నాని, శ్రీకాంత్ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. చిరు హీరోగా, శ్రీకాంత్ డైరెక్షన్‌లో ఆ సినిమా రూపొందనుంది. ఈ సినిమాతో చిరంజీవిని సరికొత్త వైల్డ్ రోల్ లో చూపించాలని శ్రీకాంత్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. గత ఏడదీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన శ్రీకాంత్ ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పనులను కూడా కంప్లీట్ చేసేసాడట. దసర సినిమా టేకింగ్‌తో తన స్టైల్ ఏంటో అందరికీ చూపించేసాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ నెక్స్ట్ చిరుతో చేయబోయే ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు మొదలయ్యాయి.

అయితే ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చిరంజీవి ఓ సినిమాలో నటించబోతున్నాడట. సందీప్ రెడ్డి.. చిరు ఫ్యాన్ బాయ్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా కాలం నుంచి వీళ్ళిద్దరి కాంబోలో ప్రాజెక్టు వస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తాజాగా సందీప్ స్పిరిట్ మూవీ పూజా కార్యక్రమాల్లో చిరంజీవి సందడి చేశారు. వీళ్లిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. అంతేకాదు.. ఈ ఈవెంట్ అభిమానుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందంటూ ఇండస్ట్రీలో టాక్ వైరల్ గా మారుతుంది.

