ఇండస్ట్రీ లోకి ప్రతి ఏడాది ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల ఇమేజ్ను సొంతం చేసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది ముద్దుగుమ్మలు తాము చేసిన సినిమాలతో.. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిన సందర్భాలు ఉన్నాయి. ఎలాంటి పాత్రలు నటించడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోయిన్లు సైతం.. స్పెషల్ సాంగ్స్ లో నటించే ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు. అలా.. ఇప్పటికే సమంత, తమన్న, శ్రీ లీల ఇలా చాలామంది స్పెషల్ సాంగ్స్ లో మెరిసారు. ఈ క్రమంలోనే.. ప్రజెంట్ మరో స్టార్ బ్యూటీ కూడా స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమైందంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
ఆమె మరెవరో కాదు రష్మిక మందన. తాజాగా రష్మిక మందన ఓ నలుగురు డైరెక్టర్ల పేర్లు చెప్పి ఆ నలుగురు అడిగితే స్పెషల్ సాంగ్స్ చేయాడానికైనా ఓకే అని క్లారిటీ ఇచ్చింది. రష్మిక తన 9 ఏళ్ల సినీ కెరీర్‌లో నాలుగు భాషల్లో మొత్తం 25 సినిమాల్లో నటించి దాదాపు అన్ని సినిమాలతోనూ సూపర్ హిట్‌లు అందుకుంది. బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుని.. నేషనల్ క్రష్ ఇమేజ్ సైతం దక్కించుకుంది. ఇక.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో.. క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ క్రమంలోనే తాజాగా రష్మిక.. జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా లో సందడి చేసింది. ఇందులో భాగంగా.. ఆమె స్పెషల్ సాంగ్స్ నూ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఈ షోలో రష్మిక మాట్లాడుతూ.. తనకు వైవిధ్యమైన పాత్రలో నటించడం అంటే ఇష్టమని వివరించింది. స్టోరీ నచ్చితే నెగటివ్ షేడ్స్‌లో అయినా చేసేస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇక.. నా మైండ్ లో నలుగురు దర్శకులు ఉన్నారని.. వాళ్ళు అడిగితే మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానంటూ కామెంట్స్ చేసింది. ఆ నలుగురు దర్శకులు తప్ప.. మరెవరు అడిగినా స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ నలుగురు దర్శకులు ఎవరనే విషయాన్ని మాత్రం అమ్మడు రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.


