అఖండ 2 మరోసారి వాయిదా.. ఆ బ్లాక్ బస్టర్ డేట్ పై కన్నేశారా..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో.. అఖండ 2 సినిమా ఒకటి. నందమూరి నట‌సింహం.. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగవ‌ సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమా లకు తగ్గట్టుగా భారీ లెవెల్లో బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే.. మొదట ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినా.. విజువల్, గ్రాఫికల్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో సినిమా వాయిదా పడింది. ఇక.. తర్వాత ఈ సినిమాను డిసెంబర్ 5 కు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

మొదట బాలయ్య ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేసిన.. లేట్‌గా వచ్చిన రికార్డులు బ్లాస్ట్‌ చేయడం ఖాయమంటూ అంచనాలను పెంచుకున్నారు. దానికి తగ్గట్టుగానే.. సినిమా నుంచి వచ్చిన రెండు టీజర్‌లో ఆడియన్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే.. ఇప్పుడు మరోసారి అఖండ 2 వాయిదా పడనుందని టాక్ వైరల్‌గా మారుతుంది. అయితే.. ఇది ఫ్యాన్స్ కు ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కారణం.. డిసెంబర్ 5న వాయిదా పడే ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుందట. ప్రభాస్ నటించిన రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Balakrishna Akhanda 2 Release Date,Akhanda 2 Postponed: వెనక్కి తగ్గిన  బాలయ్య.. 'అఖండ 2' వాయిదా.. ఓజీకి లైన్ క్లియర్ - boyapati srinu balakrishna  akhanda 2 release postponed new date to be announced soon ...

ఇప్పుడు.. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాలేదని.. విదేశాల నుంచి విఎఫ్ఎక్స్వర్క్ జరగాల్సి ఉండగా.. అది కంప్లీట్ కాకపోవడంతో జనవరి 9 కి వచ్చే అవకాశాలు లేవంటూ టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే.. రాజాసాబ్‌ తప్పుకుంటే.. ఆ ప్లేస్‌లోకి అఖండ 2 షిఫ్ట్ అవుతుందట. ఇక.. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా అంటే ఏ రేంజ్ లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. బాలయ్య సినిమా జనవరి 9న రావడమే కరెక్ట్.. రికార్డులు బ్లాస్ట్ అవుతాయి అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ మరో సెంటిమెంట్ ఏంటంటే.. ఈ సంక్రాంతికి బాలయ్యతో పాటు చిరంజీవి కూడా రంగంలోకి దిగుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎప్పుడు ఆడియన్స్ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈసారి బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టి చిరంజీవిపై సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.