వెంకీ మామ సినిమాకు త్రివిక్రమ్ మార్క్ టైటిల్.. భలే ఉంది గురూ..!

ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మంచి జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేష్ హీరోగా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాంతో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన వెంకీ మామ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా గ్యాప్ తీసుకుని ముందడుగు వేశాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్‌ను డైరెక్టర్ గా ఎంచుకున్నాడు.ఆగస్టు 15న ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు గ్రాండ్గా కంప్లీట్ చేసుకున్నారు.

Venkatesh-Trivikram Film Buzz Builds Ahead Summer Release | Venkatesh-Trivikram  Film Buzz Builds Ahead Summer Release

కాగా.. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా పని చేయ‌గా.. ఈ రెండు సినిమాలు బంపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వెంకటేష్ సినిమా అంటే ఆడియన్స్‌లో మంచి హైప్‌ మొదలైపోయింది. ఇక సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరవనుందని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో.. తాజాగా సినిమాకు సంబంధించిన టైటిల్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

Venkatesh - Trivikram Combo Movie on to Floors - businessoftollywood

సినిమాకు ఆనందరావు అనే టైటిల్ అయితే బాగుంటుందని టీం భావించారట. కానీ.. తర్వాత వెంకటేష్ వయసు టైటిల్ లో వచ్చేలా క్యాచీగా ఓ టైటిల్ పెడితే బాగుంటుంది అని ఫిక్స్ అయిన త్రివిక్రమ్.. అబ్బాయిగారు 60 ప్లస్ అనే టైటిల్ పెడితే.. క‌థ‌కు కూడా అడాప్ట్ అవుతుందనే ఉద్దేశంతో అదే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్ర‌క‌ట‌న‌ కూడా రానందని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రస్తుతం టైటిల్ వైరల్ గా మారడంతో వెంకీ మామ సినిమాకు త్రివిక్రమ్ మార్క్ టైటిల్‌ను భలే ఫిక్స్ చేశాడే అంటూ.. నిజంగానే టైటిల్ గమ్మత్తుగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.