టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఎప్పుడు ఏ సినిమా ప్రారంభమవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కాగా.. ప్రజెంట్ రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. మారుతి డైరెక్షన్‌లో హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది.
ఇక.. ఈ సినిమా తర్వాత.. ప్రభాస్ భారీ సీక్వెల్స్ లిస్ట్ లైనప్‌లో ఉంది. ఇలాంటి క్రమంలో.. ప్రభాస్ క్రేజీ.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు సుకుమార్. పుష్ప, పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న ఈ లెక్కల మాస్టారు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను చరణ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చరణ్ సినిమా తర్వాత ప్రభాస్‌తో సుకుమార్ సినిమా చేయబోతున్నాడంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం.
ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్ ల పీక్స్ లెవెల్లో అంచనాలు మొదలైపోతాయి. ఇక.. ఇప్పటికే సినిమాపై చర్చలు కూడా మొదలయ్యాయని.. ప్రభాస్ బిజీ స్కెడ్యూల్ కారణంగా సుక్కుకు ప్రభాస్ పూర్తి సమయం కేటాయించలేక నోతున్నాడని టాక్. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో అసలు సినిమా వస్తుందా.. లేదా.. అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా రామ్ చరణ్‌తో ఫిక్స్ అయిన ప్రాజెక్టును వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. ప్రభాస్ స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయ్యేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.