ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో థమన్ పేరు ఏ రేంజ్‌లో మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థమన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయా రేంజ్ లో ఆయన ఆడియన్స్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలతో సంబంధం లేకుండా కేవలం తన బిజీఎంతోనే సినిమాలు నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాడు థమన్. దానికి చివరిగా వచ్చిన బిగ్గెస్ట్ ఎగ్జామ్పుల్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఓ.ఇ. ఈ సినిమాల్లో థమన్ మ్యూజిక్.. ఏ రేంజ్ లో హైలెట్గా మారిందో తెలిసిందే. ముఖ్యంగా సినిమా టైటిల్ కార్డు నుంచి ఎండ్ కార్డ్ వరకు థమన్ ఇచ్చిన బిజిఎం ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఔట్పుట్ ని ఆడియన్స్ అసలు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. ఇక.. ఈ సినిమా తర్వాత తెలుసుకదా సినిమాకు థమన్ చార్జ్ బస్టర్ సాంగ్స్ అందించాడు. ఈ సినిమా.. దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.
ప్రస్తుతం థమన్.. బాలయ్య అఖండ 2 మ్యూజిక్ పనులు బిజీగా గడుపుతున్నాడు. ఆఖండ, డాకు మహారాజ్ సినిమాలకు థమన్ మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో.. బాలయ్యను థమన్ ఏ రేంజ్‌లో ఎలివేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అఖండ సినిమాకు అయితే థమన్ బిజీఎంకు థియేటర్స్ లో డిటిహెచ్ బాక్స్లు కాలిన సందర్భాలు ఉన్నాయి. ఆ రేంజ్ లో మ్యూజిక్ అదరగొట్టాడు. ఇక అఖండ 2కు అంతకు మించిపోయే లెవల్‌లో ఉండబోతుందని థమన్ ఇంతకుముందే క్లారిటీ ఇచ్చేసాడు. ఇక.. మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే.. ఇప్పటికే సినిమా బిజీయం కోసం ప్రత్యేక ప్లానింగ్ కూడా సిద్ధం చేసేసాడు థమన్.
అఖండ 2 డివోషనల్ మాస్ యాక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఇది వైవిధ్యమైన జోనర్ కనుక.. ఒక డిఫరెంట్ మార్క్ మ్యూజిక్ కోసం.. సనాతన ధర్మం సాహిత్యాన్ని అనుసరించి.. కొంతమందిని ప్రత్యేకంగా పిలిపించి మరి ప్లాన్ చేశాడు. వాళ్లతో ఆయన చేయించిన ఒక కోరస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. కేవలం కొరస్ వింటుంటేనే ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటిది.. దానికి థమన్ మ్యూజిక్ యాడ్ అయితే థియేటర్లు ఏ రేంజ్ లో దద్దరిల్లిపోతాయో చెప్పనవసరం లేదు. ఈ మూవీ కోసం థమన్ 100% కాదు.. 200% ఎఫర్ట్స్ పెడుతున్నాడని ఇప్పటికే అర్థమైపోయింది. మరీ.. ఈ సినిమాలో థమన్ తన మ్యూజిక్‌తో ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తాడో.. ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఇక సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. దీపావళి నుంచి ప్రమోషన్స్ షురూ చేయనున్నారు టీం.
Pandithula bhakthi shlokalu
Shetruvula shokalu 🥵💥💥💥@MusicThaman dappulu …SHIVUDI Thandavam Theatres gonna be bonkers for the interval 🥁 🥁 🥁 🔥🔥🔥🔥!!#GodOfMassesNBK #Akhanda2
pic.twitter.com/9rCn2ZiFsi— 𝗦𝗶𝗺𝗯𝗮𝗧𝘄𝗲𝗲𝘁𝘀_𝗫 🦁 (@SAgamanam) October 12, 2025