నిన్న ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్డేట్ ను రిలీజ్ చేశాడు సందీప్. ఇక ఈ వీడియోతో స్టోరీ కూడా చెప్పకనే చెప్పేశారు. ఓ సర్ప్రైజ్ సౌండ్ వీడియోను రిలీజ్ చేయగా.. ఈ వీడియోలో ప్రభాస్, ప్రకాష్ రాజ్ మధ్య జరిగే సంభాషణ నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంది. సెలబ్రేషన్స్ అక్టోబర్ 23న గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. దేశవ్యాప్తంగా.. ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఎంతోమంది ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే.. ఆయన లైనప్‌లో ఉన్న సినిమాల నుంచి కూడా క్రేజీ అప్డేట్స్ రివిల్ అయ్యాయి. హనురాగపూడి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ ఫౌజీ అని టీం క్లారిటీ ఇచ్చేశారు.
అంతేకాదు.. ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ నోట్తో ముగిస్తూ సందీప్ స్పిరిట్ నుంచి గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చాడు. ఓ సౌండ్ రూపంలో.. ఒకటిన్నర నిమిషం నడివి ఉన్న వీడియో రిలీజ్ చేసి ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో హైప్‌ని క్రియేట్ చేశాడు. ప్రభాస్ పాత్ర గురించి రివీల్ చేస్తూ.. కథ గురించి హింట్ ఇచ్చేలా ఈ వీడియోలో డైలాగ్స్ ఉన్నాయి. ఇక ఈ వీడియోలో డైలాగ్స్ ప్రకారం.. జైలుకి రిమాండ్ విధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాస్‌ని తీసుకొచ్చారు. ఆ జైల్లో ప్రకాష్ రాజ్ సూపరిండెంట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మాటల్ని బట్టి చాలా స్ట్రిక్ట్ పర్ఫెక్ట్ ఆఫీసర్ అని అర్థమవుతుంది. ఇక ప్రకాష్ రాజు రిమాండ్ విధించిన ఆ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాస్. ఆయన ఓ ఐపీఎస్ ఆఫీసర్, అకాడమీ టాపర్ అని ప్రకాష్ రాజ్‌కి కానిస్టేబుల్ పరిచయం చేస్తాడు.

వీడి గురించి విన్నా.. యూనిఫామ్ ఉన్నా, లేకున్నా బిహేవియర్ లో తేడా ఉండదని తెలిసింది. కాంటాక్ట్ ఇష్యూస్ వల్ల ఒకసారి టెర్మినేట్ అయ్యాడట కదా.. చూద్దాం. ఈ ఖైది యూనిఫాంలో ఎలా బిహేవ్ చేస్తాడో అంటూ ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేస్తాడు. ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్.. అతనికి ఇది రిమాండ్ మాత్రమే అంటూ కానిస్టేబుల్ చెబుతాడు. నా కాంపౌండ్ లో రెండే యూనిఫాంలు ఉంటాయి.. ఒకటి ఖైదీ, లేదా ఖాకీ అంటూ ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేస్తాడు. ఇక ప్రకాష్ రాజ్ వీడియో చివర్లో వీడి బట్టలు ఊడదీసి మెడికల్ టెస్ట్లకు పంపండి అని చెప్పే డైలాగ్స్ ప్రకాష్ రాజ్‌కు ఇచ్చే వార్నింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మిస్టర్ సూపరిండెంట్.. నాకు చిన్నప్పటి నుంచో ఒక చెడ్డ అలవాటు ఉంది అంటూ.. మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ లో రిపీట్ చేశాడు ప్రభాస్. ఇక సందీప్ ఇచ్చిన ఈ అప్డేట్ తో స్పిరిట్ మూవీ బ్యాక్ డ్రాప్ అర్థమవుతుంది. సినిమాలో ప్రభాస్ ఐపీఎస్ ఆఫీసర్గా ఎవరిని లెక్క చేయని ఓ యునిక్ బిహేవియర్ తో కనిపించనున్నాడు. అంతేకాదు.. ఏ కేస్‌లో ప్రభాస్‌కు రిమాండ్ విధించారు.. ఇదంతా ఎందుకు జరిగింది.. అనేది అసలు స్టోరీ అంటూ డైరెక్టర్ చెప్పకనే చెప్పేశాడు. ఇక మూవీలో ప్రభాస్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి.


