స్పిరిట్ కోసం సందీప్ మాస్టర్ ప్లాన్.. బొమ్మ అదిరిపోద్ది..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లలో సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రూపొందిన స్పిరిట్ సినిమా సైతం ఒకటి. యానిమల్ మూవీ ఫేమ్‌ తృప్తి దిమ్రి ఈ సినిమాలో హీరోయిన్గా మెర‌వ‌నుంది. ఇక.. ఈ సినిమాల్లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా మెరవనున్నాడు. పోలీస్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక.. తృప్తి ఈ సినిమాలో డాక్టర్ రోల్‌లో కనిపించనుందట. కాగా.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ డిసెంబర్ చివరలో.. లేదా జనవరి ప్రారంభంలో మొదలవుతుందని టాక్‌ నడుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.

Triptii Dimri replaces Deepika Padukone in Prabhas and Sandeep Reddy Vanga's 'Spirit'; netizens 'scream' with joy | Hindi Movie News - Times of India

ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ అప్డేట్ తెగ వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. సందీప్ రెడ్డివంగా మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను రివిల్ చేశాడు. సినిమా షూట్ చాలా వరకు మెక్సికోలో జరగనున్నట్లు వెల్లడించాడు. అయితే.. మెక్సికోలో మొదటి షెడ్యూల్ జరుగుతుందా.. లేదా హైదరాబాద్లోనే జరుగుతుందా.. అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Talk Of The Town: Sandeep Vanga's Gut Feeling

సినిమా మేజర్ షూట్ పార్ట్ మొత్తం విదేశాల్లోనే జరగనుందని.. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టు ఒక్కో సీన్‌ను సందీప్ చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడని.. కచ్చితంగా ప్రతి సన్నివేశంలో సందీప్ మార్క్ కనిపిస్తుందంటూ టాక్ నడుస్తుంది. ఇక.. సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా హర్షవర్ధన్ రామేశ్వరం వ్యవహరించనున్న‌డట. కొన్ని ట్యూన్స్ సందీప్ ఆల్ రెడీ ఫైనలైజ్ కూడా చేసినట్లు సమాచారం. భూషణ్ కుమార్, ప్రణయ రెడ్డి వంగ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2026.. చివర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ మూవీ సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో ఆడియన్స్‌లో హైప్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి.