టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగత జీవితంలోను ఆయన మాట తీరు, మంచితనంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొడుతున్నాడు చరణ్. అంతేకాదు.. ఎవరికైనా సహాయం కావాలంటే.. ఆయన ముందు వరుసలో నిలబడతారు. ఈ క్రమంలోనే.. ఆయన ఎంతోమందికి సహాయం అందించడం.. అలాగే ఏదైనా మంచి కార్యం తలపెడుతుంటే విరాళాలు అందించడం.. ఎప్పుడు కామన్ గానే చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అభిమానులు చరణ్ చేసిన ఆ మంచి పనులను ఆయన డొనేట్ చేసిన మొత్తాన్ని సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తూ మురిసిపోతూ ఉంటారు.
ఇలాంటి క్రమంలో ఓ స్టార్ డైరెక్టర్ గతంలో తాను ఓ గుడి కోసం ఇచ్చిన విరాళాన్ని రామ్ చరణ్ ఇచ్చినట్లు ప్రచారం చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ.. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. తేజ. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని డైరెక్టర్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన లవ్ స్టోరీ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్, కాజల్ అగర్వాల్, ప్రిన్స్, నందిత ఇలా ఎంతోమంది స్టార్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి లైఫ్ ఇచ్చాడు. అలాంటి తేజ.. చివరిగా అహింసా సినిమాను తెరకెక్కించి ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. అప్పటినుంచి.. ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.
కాగా.. ఈ క్రమంలోనే తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. తేజ మాట్లాడుతూ.. మహేష్ బాబు నిజం సినిమా షూట్ టైంలో.. మురళీమోహన్ గారిని ఆయన తండ్రిగా సెలెక్ట్ చేసుకున్నాను అని.. అయితే తండ్రి పాత్రలో ఆయన అసలు సెట్ కాకపోవడంతో.. ఫుల్ రెమ్యూనరేషన్ ఇచ్చేసి మరొక వ్యక్తిని ఈ ప్లేస్‌లో తీసుకున్న. అయితే.. మురళి మోహన్ మాత్రం.. సినిమా నుంచి తీసేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని.. అది కూడా తనకు కాకుండా గుడికి విరాళంగా డబ్బులు ఇవ్వాలంటు కోరారని వివరించాడు. దానికి సరే అని చెప్పి.. కొంత డబ్బు ఇచ్చానని.. అయితే నా పేరు కాకుండా ఆ గుడికి.. విరాళంగా రామ్ చరణ్ డబ్బు ఇచ్చాడంటూ ప్రచారం చేశారని తేజ వివరించాడు. ప్రస్తుతం తేజ చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.